Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ప్రైవేట్ ల్యాబ్ లో దొంగచాటుగా కొరొనా టెస్టులు - vandebharath

కార్పొరేట్ ఆసుపత్రులకు, డయాగ్నిజ్ కేంద్రాలకు అవకాశం ఇస్తే ప్రజలలో కరోనా పట్ల ఉన్న భయాన్ని ఆసరా చేసుకొని నిలువు దోపిడీ చేస్తారని ప్రభుత్...


కార్పొరేట్ ఆసుపత్రులకు, డయాగ్నిజ్ కేంద్రాలకు అవకాశం ఇస్తే ప్రజలలో కరోనా పట్ల ఉన్న భయాన్ని ఆసరా చేసుకొని నిలువు దోపిడీ చేస్తారని ప్రభుత్వ ఆసుపత్రులలో, పరీక్షా కేంద్రాలలో సామర్ధ్యం ఉన్నంతవరకు కరొనకు సంబంధించిన పరీక్షలు, చికిత్స ప్రైవేట్ ఆసుపత్రులలో చేయరాదని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేస్తూ వస్తున్నారు. పరీక్షలు జరపడానికి కొన్ని ప్రైవేట్ ల్యాబ్ లు ఐసీఎంఆర్​ అనుమతి పొందినా కేసీఆర్ వీల్లేదు అన్నారు.
అయితే విషయంలో పలు కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ల్యాబ్ లు దొంగ చాటుగా కరోనా టెస్టులు జరుపుతూ సొమ్ము చేసుకొంటున్నాయి. ఒకొక్క టెస్ట్ కు రూ 4,500 కు మించి వసూలు చేయరాదని ఐసీఎంఆర్ ఆదేశించినా అంతకు మించే వసూలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఓ కార్పొరేట్ హాస్పిటల్‌‌ ల్యాబ్‌‌లో 3 వేల మందికి టెస్టులు చేయగా, కొంత మందికి పాజిటివ్ వచ్చినట్టు ఆరోగ్య  శాఖ అధికారుల దృష్టికి వచ్చిన్నట్లు తెలిసింది.
అనుమతి లేకుండా గుట్టుగా టెస్టులు చేయడంపై ఆ  సంస్థను ఆరోగ్య శాఖ వివరణ కోరినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 10 ప్రభుత్వ, 11 ప్రైవేట్​ ల్యాబ్స్​లో కరోనా టెస్టులు చేయడానికి ఐసీఎంఆర్‌‌ అనుమతి ఇచ్చింది.
టెస్టుల నిర్వహణకు అనుమతి పొందిన సంస్థలు కొనుగోలు చేసే టెస్ట్‌‌ కిట్ల దగ్గరి నుండి, చేస్తున్న టెస్టుల వరకూ ఐసీఎంఆర్‌‌‌‌కు చెప్పాల్సి ఉంటుంది. ప్రతి ల్యాబ్‌‌కు యూజర్ ఐడీ, పాస్‌‌వర్డ్‌‌ను ఐసీఎంఆర్ కేటాయించింది. ఆయా ల్యాబ్స్​లో జరుగుతున్న టెస్టుల వివరాలు చూసే వెసులుబాటు ఐసీఎంఆర్‌‌‌‌కే ఉండగా, ఇటీవల రాష్ట్రాల ఆరోగ్యశాఖలకూ కల్పించారు.
పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న నమూనాలను  పరీక్షించామని, ఇక్కడెవరికీ టెస్టులు చేయలేదని వారు  వివరణ ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఆ ల్యాబ్స్​లో టెస్ట్ చేయించుకున్న వాళ్లలో పాజిటివ్ వచ్చిన వారు ఎవరు? ఎక్కడి వాళ్లు? వాళ్లకు ఎక్కడ టెస్ట్​ చేశారు? అనే వివరాలను అధికారులు చెప్పడం లేదు. ప్రభుత్వంలోని పెద్దలతో లాలూచి పడే వీరు టెస్టులు చేస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.