Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

షకీల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ - vandebharath

చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏండ్ల బాలికపై జరిగిన అత్యాచారం నీచమైనదని, నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాలని పియుసిఎల్ తెలంగాణ  ...


చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏండ్ల బాలికపై జరిగిన అత్యాచారం నీచమైనదని, నాగరిక సమాజం సిగ్గుతో తలదించుకోవాలని పియుసిఎల్ తెలంగాణ  విభాగం తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి బాధిత బాలికకు న్యాయం అందించే టందుకు సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ సంఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన పియుసిఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయ వింధ్యల నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ ఈ సంఘటనపై ప్రభుత్వం సత్వరం స్పందించక పోవడం పట్ల నిరసన వ్యక్తం చేసింది.

నిందితుడైన షకీల్ పై  పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్ష పడేవిధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
బాధితురాలికి సత్వర న్యాయం అందించేటందుకు వెంటనే 'ఫాస్ట్ ట్రాక్ కోర్టు ' ను ఏర్పాటు చేయాలని పియుసిఎల్ కోరింది.   అత్యాచారానికి గురైన బాలిక కు రక్షణ కలిపించాలని పోలీస్ అధికారులకు సుచిన్చచింది. స్త్రీ -శిశు సంక్షేమ శాఖా వారికీ 15 ఏళ్ళ బాలికను అప్పచెపుతె , అదే రక్షణ అనుకోవటం పొరపాటని స్పష్టం చేశారు.
బాధితురాలి విషయం లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఎప్పటికప్పుడు సంబంధీకులకు తెలియ పరచాలి, సామాజిక కార్యకర్తలకు తెలపాలి.

15 ఏళ్ళ బాధితురాలి విషయం లో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి, సంరక్షకుడి స్థానాన్ని ప్రభుత్వం పోషించాలని కమిటీ స్పష్టం చేసింది. ఆ బాధితురాలి పై ఆధారపడి ఉన్న కుటుంబానికి 'యుద్ధ ప్రాతిపదిక ' పై సంక్షేమ పథకాలు అందేవిధముగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది.