ఎనిమిది రాష్ట్రాలకు చెందిన జైళ్ల నుంచి 1700 మహిళా ఖైదీను మధ్యంతర బెయిల్, పెరోల్‌పై విడుదల చేసినట్లు జాతీయ మహిళా కమీషన్ (ఎన్‌సీ...
ఎనిమిది రాష్ట్రాలకు చెందిన జైళ్ల నుంచి 1700 మహిళా ఖైదీను మధ్యంతర బెయిల్, పెరోల్‌పై విడుదల చేసినట్లు జాతీయ మహిళా కమీషన్ (ఎన్‌సీడబ్ల్యు ) తెలిపింది. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జైళ్లలోని అధిక రద్దీని తగ్గించడానికి, సామాజిక దూరాన్ని కొనసాగించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఏప్రిల్ 22వ తేదీన పంపిన నివేదిక, పరిశీలనలు, సిపారసులపై తీసుకున్న చర్యలపై నివేదిక కోరుతూ మహిళా కమిషన్ డైరెక్టర్ జనరల్స్, జైళ్ల ఇన్పెక్టర్ జనరల్సతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఖైదీల మానసిక ఆరోగ్యం కోసం వీడియో కాల్స్( ఇ- ములాకత్) కుటుంబ సభ్యులతో ఫోన్‌కాల్స్ తప్పని సరిగా ఏర్పాటు చేస్తున్నామని ఎన్‌సీడబ్యూ ప్రకటించింది.
యూపీ రాష్ట్రానికి చెందిన 1039 మంది, చత్తీస్‌గఢ్ నుంచి 107 మంది మహిళా ఖైదీలకు మధ్యంతర బెయిల్, పెరోల్ మంజూరు చేశారు. పశ్చిమ బెంగాల్ నుంచి 93 మంది మహిళా ఖైదీలు విడుదలయ్యారు.
ఢిల్లీకి చెందిన 73 మంది, గుజరాత్ నుంచి 102 మంది, హర్యాన నుంచి 223 మంది, మణిపూర్ నుంచి 61 మంది, తెలంగాణ నుంచి 61 మంది ఖైదీలను విడుదల చేసినట్లు తెలిపింది. జైళ్లలో ఖైదీలు మాస్క్‌ల తయారీలో, కేరళ రాష్ట్రంలోని ఖైదీలు దాదాపు 500 లీటర్ల శానిటైజర్‌ను తయారు చేశారని వెల్లడించింది.