Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

భైంసాలో మళ్ళీ ఘర్షణలు - vandebharath

  నిర్మల్ జిల్లాలోని భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగి  ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. వ...

 
నిర్మల్ జిల్లాలోని భైంసాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగి  ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. వ్యాపార సంస్థలను మూసివేయించారు. సున్నితమైన ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

మరోవైపు భైంసాలో  ఈరోజు ఉదయం డీఐజీ ప్రమోద్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా శివాజి‌నగర్‌లో పరిస్థితిని ఆయన సమీక్షించారు. రాళ్లదాడిలో రెండు వాహనాలు ధ్వసం కాగా, మూడు గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. దానితో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు.

గత రాత్రి లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తూ సామూహిక ప్రార్థనలకు కొందరు గుమికూడిన సందర్భంగా వీడియో తెస్తున్న వ్యక్తిపై దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తున్నది. గతంలో ఘర్షణలు చోటుచేసుకున్న శివాజీ నగర్  ప్రాంతంలోనే ఇప్పుడు కూడా దాడులు జరగడం గమనార్హం.

ఈ సందర్భంగా కర్రలతో కొట్టుకోవడం జరిగింది. దానితో పోలీసులు రంగ ప్రవేశం చేసి అల్లరి మూకలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. భైంసాలో భద్రతను ఎస్పీ శశిధర్ రాజు పర్యవేక్షిస్తున్నారు. ఘర్షణకు కారణమైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.