Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం వలనే ఈ విషవాయువు లీక్ - vandebharath

ప్రాథమిక స్థాయి ప్రమాణాలను సహితం పాటించని కారణంగా విషవాయువు లీక్ అయి 12 మంది చనిపోవడానికి, వందలాదిమంది అస్వస్థులు కావడానికి కారణమైన వి...


ప్రాథమిక స్థాయి ప్రమాణాలను సహితం పాటించని కారణంగా విషవాయువు లీక్ అయి 12 మంది చనిపోవడానికి, వందలాదిమంది అస్వస్థులు కావడానికి కారణమైన విశాఖలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమ ఎంతటి ప్రమాదకరమైనదో సంవత్సరం క్రితమే స్వయంగా దక్షిణ కొరియా ప్రభుత్వమే హెచ్చరించింది. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోకుండా నేరమయ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ప్రస్తుతం పెనుముప్పుకు కారణమైనది స్పష్టం అవుతున్నది.
2019 ఏప్రిల్‌లో ఎల్‌జి పాలిమర్స్‌పై దక్షిణ కొరియా ప్రభుత్వం స్వయంగా ఓ ప్రకటన చేస్తూ కాలుష్య నియంత్రణకు సంబంధించిన నియమాలన్నింటినీ ఆ కంపెనీ ఉల్లంఘించిందని స్పష్టం చేసింది. 15 రెట్లకు మించిన మోతాదులో క్యాన్సర్‌ వ్యాధికి దారి తీయగల 'వినైల్‌ క్లోరైడ్‌ రసాయనాన్ని' గాలిలో వదులుతుందని హెచ్చరించింది. ఆ తర్వాతనే జగన్ ప్రభుత్వం పర్యావరణ అనుమతులతో సంబంధం లేకుండా ఆ కంపెనీ పనిచేయడానికి అవకాశాలు కల్పించడం జరిగింది.
అంతేకాదు, ఆ కంపెనీ యాజమాన్యం అనుసరించే మోసపూర్తిత ధోరణులను సహితం కొరియా ప్రభుత్వం ఆ సందర్భంగా వెల్లడి చేసింది. వాయు కాలుష్యానికి సంబంధించిన రికార్డులను తారుమారు చేసే చరిత్ర ఆ కంపెనీకి ఉన్నట్లు కూడా ఆ ప్రభుత్వమే బయటపెట్టింది. అటువంటి నేరప్రవుత్తి గల కంపెనీ పెను ముప్పును కారణమైన అనంతరం కూడా ఆ కంపెనీ చాలా మంచిదని అంటూ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి  కితాబివ్వడం దిగ్బ్రాంతి కలిగిస్తుంది.
ఈ కంపెనీ వదిలిన విషవాయువు స్వభావాన్ని పరిశీలిస్తే  ఘటన జరిగిన మే 7న కూడా 15 కిలోమీటర్ల మేర విషవాయువును ప్రజలు పీల్చి ఉంటారని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1989 పర్యావరణ నియమాల ప్రకారం స్టైరీన్‌ ఒక విషపూరిత రసాయనం. ఇలాంటివి పరిశ్రమల్లో నిల్వ ఉంచినప్పుడు యాజమాన్యం ఎన్నో జాగ్రత్తలను తీసుకోవలసి ఉంది. అయినా ఏవీ తీసుకొనక పోవడం గమనార్హం.
రెడ్‌, ఆరంజ్‌ కేటగిరీ పరిశ్రమల్లో శిక్షణ పొందిన నైపుణ్యం గల శాశ్వత సిబ్బందితోనే పనులు చేయించేలా  చూడవలసి ఉండగా, ఇక్కడ స్టైరీన్‌ వాయువు లీకయ్యే సమయంలో ఫ్యాక్టరీలో కేవలం 15 మంది క్యాజువల్‌ కార్మికులు మాత్రమే ఉన్నట్లు తేలడం గమనార్హం.
తాజాగా భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్‌) వెల్లడించిన దాని ప్రకారం స్టైరీన్‌ వల్ల క్యాన్సర్‌ వ్యాధి సోకే అవకాశాలున్నాని అంతర్జాతీయ క్యాన్సర్‌ పరిశోధనా సంస్థ వెల్లడించినట్లు స్పష్టం అవుతుంది. కేవలం ఇప్పుడు గాయపడిన వారిని, ఆ కంపెనీ పరిసరాలలో ఉన్న వారిని మాత్రమే కాకుండా 10 నుండి 15 కిమీ వరకు ఈ రసాయనాన్ని పీల్చిన ప్రజల అందరి పరిస్థితులపై దీర్ఘకాలిక అధ్యయనం చేపట్టవలసి ఉన్నదని  పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.