Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ ఈ నెల 20న దేశ వ్యాప్తంగా నిరసన - vandebharath

  బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కార్మిక  చట్టాల సస్పెన్షన్ ను దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘం అయిన ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ స...

 
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కార్మిక  చట్టాల సస్పెన్షన్ ను దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘం అయిన ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) తీవ్రంగా ఖండించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించింది.
ఈ చర్యలకు నిరసనగా ఈ నెల 20న దేశ వ్యాప్తంగా నిరసన దినం పాటిస్తున్నట్లు  బీఎంఎస్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ ప్రకటించారు. ఈ నెల 13న బీఎంఎస్ నేషనల్ ఆఫీస్ బేరర్స్ వెబ్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నమని తెలిపారు.
లాక్ డౌన్ వల్ల వలసకూలీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, దీనికి చాలా రాష్ట్రాలు కార్మిక  చట్టాలను ఉల్లంఘించడమే కారణమని ఆరోపించింది. కార్మిక చట్టాలను ఉపసంహరించడం, పనిగంటలు ను 8 నుంచి 12 గంటలకు పెంచడాన్ని ఉపాధ్యాయ్ తప్పుబట్టారు.
`కార్మిక చట్టాలను మూడేళ్లపాటు సస్పెండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్ నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్, గుజరాత్ లు కూడా ఆర్డినెన్స్ లు జారీ చేశాయి. పనిగంటలను పెంచుతూ రాజస్థాన్, మహారాష్ట్ర, గోవా, ఒడిశాలు నిర్ణయం తీసుకున్నాయి' అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇతర రా ష్ట్రాలు కూడా ఇదే దారిలో వెళ్లాలని ఆలోచిస్తున్న దృష్ట్యా తమకు నిరసన చేయడం తప్ప వేరే దారి లేదని ఆయన స్పష్టం చేశారు.కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన రూ 20 లక్షల ప్యాకేజీని స్వాగతిస్తు్న్నట్లు చెప్పారు.