Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి అండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకే చర్యలు తీసుకోవడం లేదు - vandebharath

  విశాఖలో  12 మంది ప్రాణాలు బలిగొని, వేలాదిమందిని అనారోగ్యానికి గురిచేసిన ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ భద్రతా పరంగా వైఫల్యం చెందడంపై చట్టపర...

 

విశాఖలో  12 మంది ప్రాణాలు బలిగొని, వేలాదిమందిని అనారోగ్యానికి గురిచేసిన ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ భద్రతా పరంగా వైఫల్యం చెందడంపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం పట్ల ఏపీ ప్రభుత్వం ఎటువంటి ఆసక్తి చూపడం లేదు. కనీస బాధితులకు చట్టపరంగా తగు పరిహారం కంపెనీ అందించే ఏర్పాట్లు కూడా చేయడం లేదు.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి ఎటువంటి అనుమతులు లేకపోయినా కేవలం రాష్ట్ర ప్రభుత్వంలోని  పెద్దల అండదండలతోనే నడుస్తున్న ఈ కంపెనీ ప్రయోజనాలు కాపాడడానికి స్వయంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటి వరకు అక్రమంగా నడుస్తున్న ఆ కంపెనిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామని ఒక్కమాట కూడా తినకపోవడం గమనార్హం.
పేరుకు ఆ కంపెనీపై ఒక పోలీస్ కేసు నమోదు చేసినా ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్య ప్రతినిధులను విచారించనే లేదు. సాధారణంగా ఇటువంటి కేసులలో యాజమాన్యం ముందస్తు బెయిల్ తీసుకొంటుంది. కానీ ప్రభుత్వం తమను ఏమీ చేయదులే అన్న భరోసా ఉండబట్టే ముందస్తు బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేయడం లేదు.
బాధిత గ్రామాల ప్రజలను ఆస్పత్రుల్లో పడేసి, కంపెనీకి నష్టం జరగకుండా అన్ని కార్యకలాపాలను ప్రభుత్వమే నడిపిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.91 కోట్ల విలువైన స్టైరిన్‌ తరలింపు అందులో భాగమేనని తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితులలో కంపెనీ తిరిగి తెరుచుకోవడానికి ఆరు నెలల వరకు పెట్టె అవకాశం ఉన్నందున అవి వృద్దా అయి కంపెనీకి నష్టం జరుగకుండా కొరియాకు ప్రభుత్వమే దగ్గర ఉంది తరలించినట్లు తెలుస్తున్నది.
విషవాయువులకు స్టైరిన్‌తోపాటు అందులో కలిసిన రసాయనం పెంటేన్‌ కూడా కారణమనే వాదన ఉంది. స్టైరిన్‌ కంటే...పెంటేన్‌ చాలా ప్రమాదకరం. ఆ ట్యాంక్‌ పేలితే అణుబాంబు పేలినట్టే. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండూ అక్కడ ఉంచడం క్షేమం కాదని కంపెనీ భావించింది. ఇటువంటి ముడిసరుకుపై కంపెనీలు సహజంగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొంటాయి. వీటిని కొరియాకు తరలిస్తే బ్యాంకుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది.
కాగా, విషవాయువు లీక్ అయినప్పుడు అక్కడ 15 మంది ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. కానీ ఇప్పుడు వారెవ్వరూ కనిపించడం లేదు. దర్యాప్తు కోసం వచ్చిన కేంద్ర, రాష్త్ర ప్రభుత్వ బృందాలకు సహితం వారు అందుబాటులో ఉండడం లేదు. దానితో కంపెనీని ఈ ఘోర తప్పిదం నుండి కాపాడటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీవ్రంగా ప్రయత్నం చేస్తుందో వెల్లడి అవుతుంది.