గ్రేటర్ హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ లాక్ డౌన్ నిబంధనలను గాలిలోకి వదిలివేస్తూ ఉండడంతో కరోనా వైరస్ తెలియకుండానే వ్యాప్తి చెందుత...
గ్రేటర్ హైదరాబాద్ రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ లాక్ డౌన్ నిబంధనలను గాలిలోకి వదిలివేస్తూ ఉండడంతో కరోనా వైరస్ తెలియకుండానే వ్యాప్తి చెందుతున్నది. హాట్ స్పాట్ లో ఉన్న ఎల్బీ నగర్ లో ఓ వ్యాపారి కుటుంబం చేసుకున్న బర్త్‌డే పార్టీ కారణంగా 47 మందికి కరోనా సోకి తీవ్రమైన అలజడి సృష్టించింది.
షాప్ ఓనర్ నుంచి మలక్‌పేట గంజ్‌లో పనిచేసే కార్మికుడికి వైరస్ సోకింది. వ్యాపారి కుటుంబ సభ్యులతోపాటు వారి బంధువులకు కరోనా సోకింది. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
బర్త్‌డే పార్టీ కారణంగా 45 మందికి కరోనా సోకితే అందులో 25 మంది వ్యాపారి కుటుంబసభ్యులే ఉన్నారు. హాట్ స్పాట్ లో ఈ విధంగా ఓకే పార్టీ జరుపుతూ ఉంటె అధికారులు ఏమి చేస్తున్నారనే ప్రశ్న తలెత్తుతుంది.
ఇప్పుడు ఎల్బీనగర్ వనస్థలిపురం ప్రాంతాల్లో మొత్తం 15 కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ప్రస్తుతం అధికారులు ప్రైమరీ కాంటాక్ట్ కేసుల్ని వేతికేపనిలోపడ్డారు. ఎల్బీనగర్‌లో ఇప్పటి వరకు 57 కేసులు నమోదు కాగా ఐదుగురు మృతి చెందారు. 44 మంది చికిత్స పొందుతుండగా 8 మంది డిశ్చార్జ్ అయ్యారు.
హైదరాబాద్‌లో నమోదు అవుతున్న కేసుల్లో ఎక్కువిగా ఎల్బీనగర్ ప్రాంతంలోనే ఉంటున్నాయి. మూడు నాలుగు రోజుల నుంచి వనస్థలిపురం, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆదివారం వనస్థలిపురంలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
ఆదివారం తెలంగాణలో కొత్తగా 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వారిలో 26 మంది హైదరాబాద్ నుంచే ఉన్నారు. రాష్ట్రంలో 1,196కు కరోనా పాజిటివ్ కేసులు చేరాయి. 415 మంది కరోనా బాధితులకు చికిత్స కొనసాగుతోందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటి వరకు 751 మందిని డిశ్చార్జ్ చేశామని అధికారుల తెలిపారు. అయితే కరోనా వల్ల 30 మంది మృతి చెందారు.