4 ఔషదాలు గుర్తించిన భారత సంతతి వైధ్యుడు - vandebharath

 
కరోనా వైరస్‌పై పోరాడే రెమ్‌డెసివిర్‌ సహా నాలుగు యాంటీ వైరల్‌ ఔషధాలను అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన వైద్యుడు గుర్తించారు. అమెరికాలోని మిస్పోరి విశ్వవిద్యాలయంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ కమలేంద్రసింగ్‌, ఆయన సహచరులు కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డ్రగ్‌ డిజైన్‌ను ఉపయోగించి కొవిడ్‌-19 చికిత్సలో రెమ్‌డెసివిర్‌, 5-ఫ్లోరోరాసిల్‌, రిబావిరిన్‌, ఫావిపిరవిర్‌ మందుల ప్రభావాన్ని పరిశీలించారు.

కరోనా వైరస్‌ యొక్క ఆర్‌ఎన్‌ఏ ప్రోటీన్లను కరోనా వైరస్‌ యొక్క జన్యు కాపీలను తయారుచేయకుండా నిరోధించడంలో ఈ నాలుగు యాంటీ వైరల్‌ మందులు ప్రభావవంతంగా ఉన్నాయని పాథోజెన్స్‌ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో పేర్కొన్నారు. కొవిడ్‌-19 చికిత్సలకు సాధ్యమైనంత వరకు ఔషధాలను సూచించడమే మా లక్ష్యమని, అంటువ్యాధులతో బాధపడుతున్న రోగుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపర్చడమే తమ పరిశోధనల ఉద్దేశమని ప్రొఫెసర్‌ కమలేంద్రసింగ్‌ తెలిపారు.

ఇలా ఉండగా, హెపటైటిస్‌ సీ వ్యాధి చికిత్స కోసం ఆమోదించిన పలు మందులు కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఉపయోగపడుతాయని ఓ పరిశోధనలో తేలింది. జర్మనీలోని జోహన్నెస్‌ గుటెన్‌బర్గ్‌ యూనివర్సిటీ మెయిన్జ్‌ (జేజీయూ) పరిశోధకులు సూపర్‌ కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి చేపట్టిన లెక్కల విధానంలో సార్స్‌ కొవిడ్‌-2 ప్రొటీన్లను బంధించే 42 వేల పదార్థాలను సిమ్యులేట్‌ చేశారు.

హెపటైటిస్‌ సీ డ్రగ్‌లోని సిమెప్రివిర్‌, పరిటప్రివిర్‌, గ్రాజోప్రివిర్‌, వెల్‌పటస్విర్‌ సమ్మేళనాలు సార్స్‌ కొవిడ్‌-2 ఇన్‌ఫెక్షన్‌ను సమర్థంగా అడ్డుకోగలవని గుర్తించారు. ఈ గణాంక విధానం ల్యాబ్‌ పరిశోధనల కంటే తక్కువ ఖర్చు, ఎక్కువ వేగంగా పూర్తవుతుందని జేజీయూ ప్రొఫెసర్‌ థామస్‌ ఎఫ్ఫర్త్‌ తెలిపారు.

 మరోవంక,  కరోనా వైరస్‌ను అంతమొందించే యాంటీబాడీని అభివృద్ధి చేయడంలో తమ దేశానికి చెందిన పరిశోధకులు కీలక ముందడుగు వేసినట్లు ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి నెఫ్తాలీ బెన్నెట్‌ ప్రకటించారు. ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షణలో పనిచేసే ‘ఇజ్రాయెల్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ రీసెర్చ్‌' (ఐఐబీఆర్‌) పరిశోధనశాల  యాంటీబాడీ  అభివృద్ధి పూర్తి చేసిన్నట్లు తెలిపింది.
Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]