Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

జమ్మూ కాశ్మీర్ ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు - vandebharath

  జమ్మూ కాశ్మీర్ లోని  అవంతిపోరాలో ష‌ర్షాలీ ఖ్రోవ్ ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. స్థానిక పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌లిసి ఆప‌రేష‌న...

 
జమ్మూ కాశ్మీర్ లోని  అవంతిపోరాలో ష‌ర్షాలీ ఖ్రోవ్ ప్రాంతంలో ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. స్థానిక పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు క‌లిసి ఆప‌రేష‌న్ నిర్వ‌హిస్తున్నాయి. భ‌ద్ర‌తా బ‌ల‌గాలు జ‌రిపిన కాల్పుల్లో ఉగ్ర‌వాది హ‌త‌మ‌య్యాడు.

నిన్న సాయంత్రం ఉగ్ర‌వాదులు దాగి ఉన్నార‌న్న స‌మాచారంతో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని కార్డెన్ స‌ర్చ్ నిర్వ‌హించాయి. దీంతో ఒక ఇంటి నుంచి కాల్పులు ప్రారంభం కావ‌డంతో బ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌రిపాయి.

నిన్న రాత్రి చీక‌టి కార‌ణంగా స్థానిక పౌరుల‌కు హాని జ‌రుగుతుంద‌ని బ‌ల‌గాలు కాల్పులు ఆపివేసి ఆ ప్రాంతం మొత్తం చుట్టుముట్టాయి. ఉద‌యం మ‌ళ్లీ అదే ఇంటి నుంచి కాల్పులు జ‌ర‌గ‌డంతో భ‌ద్ర‌తాబ‌ల‌గాలు ఎదురుకాల్పులు జ‌రిపాయి.

ఎదుటి నుంచి కాల్పులు ఆగిపోగాగే వెళ్లి చూడ‌గా ఒక ఉగ్ర‌వాది మృతి చెంది ఉన్నాడు. ఘ‌ట‌నా స్థ‌లం నుంచి మ‌రో ముగ్గురు తీవ్ర‌వాదులు పారిపోయిన‌ట్లు బావిస్తున్నారు. స్థానికంగా ఇంకా ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్నారు.