Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

తృణముల్‌ mp BJP లోకి

లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ లోక...



లోక్‌సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ లోక్‌సభ ఎంపీ సుమిత్రా ఖాన్ బుధవారంనాడు భారతీయ జనతా పార్టీలో చేరారు. అంతకుముందు ఆయన బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కలుసుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ఆయన మీడియాకు తెలిపారు. దీనికి ఒకరోజు ముందు ఆయన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తనను ఓ పోలీసు అధికారి చంపాలనుకుంటున్నట్లు ఆరోపించారు.  ఆ పోస్ట్ అనంతరం టిఎంసి సీనియర్ నేతలు ఆయనను మందలించినట్టు కూడా తెలుస్తోంది.

కాగా, మరో ఐదుగురు టీఎంసీ ఎంపీలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తనతో వారంతా టచ్‌లో ఉన్నారని బీజేపీ నేత, టీఎంసీ మాజీ సభ్యుడు ముకుల్ రాయ్ మరో బాంబు పేల్చారు.