ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ ట్యాంక్‌ను నడిపారు. కే9 వజ్రా హోవిజర్ గన్‌ను ఆయన స్వయంగా నడిపారు. లార్సన్ అండ్ టార్బో సంస్థ దాన్ని ...
ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ ట్యాంక్‌ను నడిపారు. కే9 వజ్రా హోవిజర్ గన్‌ను ఆయన స్వయంగా నడిపారు. లార్సన్ అండ్ టార్బో సంస్థ దాన్ని నిర్మించింది. గుజరాత్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ.. అక్కడ కే9 వజ్రా యుద్ద వాహనాన్ని ఆవిష్కరించారు.
రానున్న 42 నెలల్లో మొత్తం 100 హవిజర్ గన్‌లను కొనేందుకు రక్షణశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ఒప్పందం జరిగింది. సూరత్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హజిరాలో ఆర్మర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలోనే కే9 వజ్రా టీ155ఎంఎం-52 క్యాలిబర్ ట్రాక్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హోవిజర్ గన్నులను తయారు చేస్తున్నారు.