Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

బీజేపీకి మరిన్ని సీట్లతో పాటు ఓట్ల షేర్

2014 సార్వత్రిక ఎన్నికల్లో కంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లతో పాటు ఓట్ల షేర్ పెరుగుతుందని కేంద్రమంత్రి ప్...


2014 సార్వత్రిక ఎన్నికల్లో కంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి మరిన్ని ఎక్కువ సీట్లతో పాటు ఓట్ల షేర్ పెరుగుతుందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ సాధించిన 282 సీట్లకు అదనంగా ఈసారి పశ్చిమబెంగాల్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా సీట్లు వచ్చి చేరుతాయని చెప్పారు.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి ప్రత్యామ్నాయం లేదని చెబుతూ  ఆయనను కాదనుకుంటే దేశంలో అరాచకం నెలకొంటుందని కేంద్ర మంత్రి హెచ్చరించారు. కోల్‌కతాలో శనివారం జరిగిన విపక్షాల ర్యాలీపై ఆయన విమర్శలు గుప్పిస్తూ, ప్రజలు బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా, బలహీన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా అనేది ఎన్నికల కీలకాంశాల్లో ఒకటవుతుందని స్పష్టం చేశారు. 
'కోల్‌కతాలో నిన్న జరిగిన ర్యాలీని చూడండి. విపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చాయి. మోదీని గద్దె దింపడమే ఆ పార్టీల ఏకైక లక్ష్యమని చాలా స్పష్టంగా తేలింది. మరి మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు?. ఆ ప్రత్నామ్నాయం ఎవరో వారు చూపించలేదు. మోదీ లేకుంటే దేశంలో అరాచక పరిస్థితులకు వీలుంది' అని జవదేకర్ ఆందోళన వ్యక్తం చేశారు.
గతంలో ఐకే గుజ్రాల్, చంద్రశేఖర్, హెచ్‌డీ దేవెగౌడ సారథ్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ, బలహీన ప్రభుత్వాల హయాంలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని, అదే ప్రజలు మోద సారథ్యంలో పటిష్టమైన, విధానాలకు కట్టుబడిన ప్రభుత్వం వల్ల చేకూరే ప్రయోజనాలను కూడా చవిచూశారని గుర్తు చేశారు. బలమైన ప్రభుత్వం కావాలో, బలహీన ప్రభుత్వాన్ని ఎంచుకుంటారో ప్రజలే తేల్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
విపక్షాల ర్యాలీలో కనీస ఉమ్మడి కార్యక్రమానికి కమిటీ ఏర్పాటు చేయడమో, డ్రాఫ్ట్ మేనిఫెస్టో కమిటీని నియమించడమో జరగలేదని, ఈవీఎంలపై మాత్రం ప్యానల్ వేశారని ఎద్దేవా చేశారు. దానిని బట్టే రాబోయే ఓటమికి విపక్షాలు ఇప్పట్నించే సాకులు వెతుకుతున్నాయనే విషయం అర్ధమవుతోందని జవదేకర్ పేర్కొన్నారు.