Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రోజుకు రూ.2,200 కోట్ల చొప్పున శ్రీమంతుల సంపద

దేశంలోని శ్రీమంతుల సంపద గతేడాదంతా రోజుకు రూ.2,200 కోట్ల చొప్పున పెరుగుతూపోయింది. దేశ జనాభాలో కేవలం ఒక్క శాతంగా ఉన్న అపర కుబేరుల ఆస్తులు...


దేశంలోని శ్రీమంతుల సంపద గతేడాదంతా రోజుకు రూ.2,200 కోట్ల చొప్పున పెరుగుతూపోయింది. దేశ జనాభాలో కేవలం ఒక్క శాతంగా ఉన్న అపర కుబేరుల ఆస్తులు నిరుడు దాదాపు 39 శాతం ఎగబాకితే.. సగానికున్న సామాన్యుల ఆదాయం మాత్రం 3 శాతమే వృద్ధి చెందిందని ఆక్స్‌ఫామ్ అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. భారత్‌లోని మొత్తం సంపదలో 77.4 శాతం 10 శాతం మంది దగ్గరే ఉందన్న ఆక్స్‌ఫామ్.. ఇందులో ఒక్క శాతం మంది వద్ద ఉన్నదే 51.5 శాతమని పేర్కొన్నది.
జనాభాలో 60 శాతంగా ఉన్న దిగువస్థాయి ఆదాయ వర్గాల చేతుల్లోగల సంపద 5 శాతాని కంటే తక్కువేనని తాజా అధ్యయనంలో వెల్లడించింది. 4.8 శాతంగానే ఉందన్నది. అలాగే టాప్ 9 బిలియనీర్ల వద్దగల సంపద.. దేశంలోని 50 శాతం జనాభా వద్దనున్న సంపదకు సమానమని చెప్పింది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా సంపన్నులు, కార్పొరేట్ల పన్ను రేట్లు తగ్గుతుండటం శోచనీయమన్నది. ఇకపోతే జనాభాలో 10 శాతానికి సమానమైన 13.6 కోట్ల మంది నిరుపేదలు 2004దాకా అప్పుల్లోనే ఉండిపోయారని ఆక్స్‌ఫామ్ తెలియజేసింది.
భారత్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య, ప్రజా ఆరోగ్య, పారిశుధ్య, నీటి సరఫరాల సంయుక్త వ్యయం రూ.2,08,166 కోట్లుగా ఉందని, దేశ అపర కుబేరుడైన ముకేశ్ అంబానీ సంపద రూ.2.8 లక్షల కోట్ల కంటే ఇది తక్కువేనని గుర్తుచేసింది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే భారతీయ ప్రజాస్వామ్య, సామాజిక నిర్మాణం కుప్పకూలడం ఖాయమని  ఆక్స్‌ఫామ్ అంతర్జాతీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విన్నీ బైనిమియా హెచ్చరించారు. ఈ అధ్యయనం కీలక సేవలపట్ల ప్రభుత్వాలు ఎటువంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నదానికి అద్దం పట్టింది. ఆరోగ్యం, విద్య వంటి ప్రధానమైన ప్రజా సేవలకు తగినన్ని నిధులు దక్కడం లేదు.
మరోవైపు కార్పొరేట్ సంస్థలు, సంపన్నులు పన్నులను నిజాయితీగా చెల్లించడం లేదు. సామాన్యులకే పన్ను వేధింపులుంటున్నాయి అని ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈవో అమితాబ్ బెహర్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే పేద, ధనిక వర్గాల మధ్య భారీగా పెరుగుతున్న అంతరాలను తగ్గించాలని సదస్సుకు హాజరైన వివిధ దేశాల సంపన్నులు, రాజకీయవేత్తలకు అంతర్జాతీయ హక్కుల ప్రతినిధిగా ఉన్న ఆక్స్‌ఫామ్ సూచించింది.