Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

దేశ సరిహద్దుల్లో రోడ్లు సూపర్

ఇటు పాకిస్థాన్, అటు చైనాతో సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకంగా ముఖ్యమైన రోడ్లను కేంద్రం నిర్మించ తలపెట్టింది. చైనా సరిహద్దు పొడవునా 44 వ్యూహాత...



ఇటు పాకిస్థాన్, అటు చైనాతో సరిహద్దుల వెంబడి వ్యూహాత్మకంగా ముఖ్యమైన రోడ్లను కేంద్రం నిర్మించ తలపెట్టింది. చైనా సరిహద్దు పొడవునా 44 వ్యూహాత్మక రోడ్లు.. పాకిస్థాన్‌తో సరిహద్దు గల పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాల పరిధిలో 2,179 కి.మీ పొడవునా రోడ్లను నిర్మించాలని నిర్ణయానికి వచ్చింది. ఘర్షణ సమయంలో భారత్- చైనా సరిహద్దు మధ్య త్వరితగతిన సైనిక బలగాలను తరలించేందుకు వీలుగా 44 వ్యూహాత్మక సరిహద్దు రోడ్లను నిర్మించాలని 2018-19 వార్షిక నివేదికలో కేంద్ర ప్రజాపనుల శాఖ (సీపీడబ్ల్యూడీ) పేర్కొంది. 

భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో జమ్ము కశ్మీర్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్ వరకు సుమారు 4,000 కి.మీ పొడవునా వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) కలిగి ఉన్నది. 2017లో చైనా రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత డోక్లాం పరిధిలో ఇరు దేశాల మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న సంగతి తెలిసిందే.

దీంతో ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను నిర్మించడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం భావిస్తున్నది. ఈ పరిధిలో జమ్ముకశ్మీర్‌తోపాటు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి. చైనాతో సరిహద్దుల వెంబడి 44 వ్యూహాత్మక రోడ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా. 

ఈ మేరకు ప్రజా పనుల మంత్రిత్వశాఖ రూపొందించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ (డీపీఆర్) ప్రస్తుతం ప్రధాని మోదీ సారథ్యంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం కోసం వేచి చూస్తున్నాయి. మరోవైపు పాకిస్థాన్‌తో సరిహద్దు గల పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాల పరిధిలో 2,179 కి.మీ. పొడవునా రోడ్ల నిర్మాణానికి రూ. 5,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా.