Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

భోగి శుభాకాంక్షలు

#భోగి_పండుగ_విశిష్టత సంక్రాంతి ఒక ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ క...

#భోగి_పండుగ_విశిష్టత

సంక్రాంతి ఒక ముచ్చటైన పండుగ. చిన్నాపెద్దా అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే వేడుక. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ కొత్త ఆనందాలను మోసుకొస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందంటారు పెద్దలు. దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత.

పాతకు స్వస్తి, కొత్తకు ఆహ్వానం
భోగి నాడు తెల్లవారుజామునే లేచి భోగిమంటలు వేయడం ఆనవాయితీ, ఆవు పేడతో తయారైన పిడకలు, మామిడి, రావి, మేడి చెట్ల అవశేషాలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కొత్తమార్గంలోకి పయనించాలని దీని అర్థం. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ప్రారంభం కానుండటంతో కాలంతోవచ్చే మార్పులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని బోధించేదే భోగి పండుగ.