Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అభివృద్ధి రహదారి నిర్మాత ‌మోడి

మన దేశంలో చాలా అంశాల్లో అడ్డంకిగా ఉన్న కులం, మతం, ప్రాంతం లాంటి స్పీడ్‌బ్రేకర్లను తొలగించి అభివృద్ధి అనే రహదారిని మన ప్రధాని మోదీ నిర్మి...



మన దేశంలో చాలా అంశాల్లో అడ్డంకిగా ఉన్న కులం, మతం, ప్రాంతం లాంటి స్పీడ్‌బ్రేకర్లను తొలగించి అభివృద్ధి అనే రహదారిని మన ప్రధాని మోదీ నిర్మించరాని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప్రశంసించారు. కన్నాట్‌ప్లేస్ మార్కెట్ సమీపంలోని ఎంపోరియా కాంప్లెక్స్‌లో ‘హ్యూనర్ హాత్’ కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులిద్దరూ అక్కడి ఫెయిర్‌లో తిరిగి స్థానిక కళాకారులతో ముచ్చటించారు.


 ఇలాంటి ఫెయిర్‌లు కళాకారులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని, ముఖ్యంగా వారు తయారు చేసిన కళాత్మక వస్తువులను ప్రదర్శించడానికి మంచి వేదికగా ఉపయోగపడుతుందని వారు వ్యాఖ్యానించారు. 22 దేశాలకు చెందిన కళాకారులు, చేతిపనివారు, నిపుణులు ఇందులో పాల్గొంటున్నారని, మోదీ ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకంగా ఉన్న కులం, మతం, ప్రాంతం వంటి అంశాలను చెరిపేసి కేవలం అభివృద్ధి అనే జాతీయ బాటను వేస్తూ దూసుకుపోతోందని  నఖ్వీ వ్యాఖ్యానించారు.

ఇలాంటి ఫెయిర్‌లు శిల్పులు, చేతిపనివారి సాధికారితకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా గత రెండేళ్లలో 1.65 లక్షల మంది శిల్పులు, చేతిపనివారికి ఉద్యోగాలు, ఉపాధి లభించిందని ఆయన చెప్పారు. హునార్ హాత్ ఒక నమ్మకమైన బ్రాండ్ అది ఇది కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాక, ఉద్యోగ అవకాశాలు కూడా మార్గదర్శనం చేస్తుందని తెలిపారు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించడమే కాక, మార్కెటింగ్ చేసుకునే విధానాన్ని కూడా తెలియజేస్తుందని పేర్కొన్నారు. 

మన ప్రధాని మోదీ అమలు చేస్తున్న మేకిన్ ఇండియా, స్టాండప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే కాకుండా అనేక మందికి అవకాశాలు కల్పిస్తోందని ఆయన ప్రశంసించారు. గుజరాత్, యూపీ, బిహార్ తదితర రాష్ట్రాలే కాక దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన కళాకారులు తమ ప్రతిభతో తయారు చేసిన వస్తువులు ఒకేచోట కొలువై ఉండటం ఆహ్లాదం కలిగిస్తోందని కేంద్ర మంత్రి నఖ్వీ వ్యాఖ్యానించారు.