Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

నిరుద్యొగులకు శుభవార్త

ఈ ఏడాది కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే వారి సంఖ్య 6 పెరగవచ్చని టాలెంట్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన మెర్సెర్‌మెటల్ తెలిపింది. 2018ల...


ఈ ఏడాది కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే వారి సంఖ్య 6 పెరగవచ్చని టాలెంట్ అసెస్‌మెంట్ ప్లాట్‌ఫామ్ అయిన మెర్సెర్‌మెటల్ తెలిపింది. 2018లో కంపెనీలు ఉద్యోగులను నియమించుకోవడం 25 శాతంగా ఉండగా, 2019aలో అది ఆరు శాతం పెరిగి 31 శాతానికి చేరుకోవచ్చని‘ స్టేట్ ఆఫ్ టాలెంట్ అక్విజిషన్ 2019’ పేరుతో విడుదల చేసిన నివేదికలో సంస్థ తెలిపింది.
అంతేకాకుండా కంపెనీలు కొత్త ఉద్యోగాల నియామకాల కోసం తమ బడ్జెట్‌లను గత ఏడాదిలో ఉన్న 20 శాతంనుంచి 34 శాతానికి పెంచిన దృష్టా కూడా నియామకాలు గణనీయంగా పెరిగే అవకాశముందని ఆ నివేదిక తెలిపింది. అంతేకాకుండా, వ్యాపార కార్యకలాపాలు, సేల్స్, టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగుల నియామకాలు ఎక్కువగా జరిగే అవకాశముందని , ఎందుకంటే ఈ రంగాల్లో ముఖ్యంగా ఉత్తర భారతంలో టాలెంట్ ఉన్నఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని కూడా ఆ నివేదిక అభిప్రాయపడింది.
సీనియర్ స్థాయి, మధ్యస్థాయిలో నిర్ణయాలు నిర్ణయాలు తీసుకోవడం, డాటా అనలిటిక్స్ లాం టి నైపుణ్యాలు కలిగి ఉండడం లాంటి వాటికి కంపెనీలు కొత్త వారిలో ప్రాధాన్యత ఇస్తున్నాయని, కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువతలో త్వరగా నేర్చుకోవడం లాంటి లక్షణాలు ఉంటాయని కంపెనీలు నమ్ముతున్నాయని ఆ సంస్థ తెలిపింది.
అంతేకాదు, తాము ఎంచుకున్న టాలెం ట్ ఉన్నవారిని సంపాదించుకోవడానికి తాము ఎక్కువగా సోషల్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తామని ఇంటర్వూ చేసిన కంపెనీల యజమానుల్లో 92 శాతం మంది చెప్పడాన్ని ఉద్యోగార్థులు గుర్తు పెట్టుకోవాలని కూడా ఆ సంస్థ సూచించింది. సోషల్ నెట్‌వర్క్‌లలో ఉద్యోగార్థుల రెస్యూమ్‌లను క్షుణ్ణంగా పరిశీలించి తమకు కావలసిన అర్హతలున్న వారిని ఎంపిక చేసుకుంటామని 84 శాతం మంది చెప్పారు.
అయితే నిరుద్యోగుల్లో ఎక్కువ మంది ఇప్పటికీ బడా కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో చిన్న కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు ఉండే వారు దొరకడం కష్టంగా మారుతోందనేది కఠోర వాస్తవం అని మెర్సెర్‌మెటల్ తన నివేదికలో తెలిపింది. 900కు పైగా నిర్ణయాలు తీసుకునే ఉన్నతాధికారుల ఇంటర్వూ ఆధారంగా ఆ సంస్థ ఈ నివేదికను రూపొందించింది.