Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రూ.6,900 కోట్ల విలువైన ఆస్తులను జప్తు

బినామీ ఆస్తులు కలిగినవారిపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బినామీ చట్టం సత్ఫలితాలను ఇస్తున్నది. ఇప్పటి వరకు ...


బినామీ ఆస్తులు కలిగినవారిపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బినామీ చట్టం సత్ఫలితాలను ఇస్తున్నది. ఇప్పటి వరకు ఈ చట్టం కింద రూ.6,900 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రజా ప్రకటన ద్వారా వెల్లడించింది.
 బినామీ ఆస్తులను ప్రోత్సహిస్తున్న వారు, కలిగివున్నవారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన ఐటీ శాఖ..ఈ నూతన చట్టం కింద గరిష్ఠంగా ఏడేండ్ల వరకు జైలు శిక్షతోపాటు బినామీ ఆస్తిలో 25 శాతం జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ఈ ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఈ నూతన చట్టం కింద ఇప్పటి వరకు రూ.7 వేల కోట్ల వరకు ఆస్తులను జప్తు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. 
తనకున్న ఆస్తులను ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయనివారిని లక్ష్యంగా చేసుకొని నరేంద్ర మోదీ సర్కార్ ఈ నూతన చట్టానికి శ్రీకారం చుట్టింది. బినామీ దారు అంటే తనకు చెందిన ఆస్తు(స్థిర లేదా చర)లను తనకు నమ్మకమైన వారి పేర్లతో(బినామీదారు) రిజిస్ట్రేషన్ చేస్తారు. నిజంగా ఈ ఆస్తులు ఇతర వ్యక్తులకు చెందినవి. ఈ నూతన చట్టం నవంబర్ 1, 2016 నుంచి అమలులోకి వచ్చింది. 
షారుఖ్ ఖాన్‌కు భారీ ఊరట
ఇలా ఉండగా, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు భారీ ఊరట లభించింది. మహారాష్ట్రలోని అలీబాగ్ వద్ద ఉన్న బినామీ ప్రాపర్టీతో లబ్దిపొందినట్లు ఆయనకు వ్యతిరేకంగా ఆదాయ పన్ను శాఖ నమోదు చేసిన కేసును అప్పిలెట్ ఆథార్టీ కొట్టివేసింది. గతేడాది ఫిబ్రవరిలో ఆయనకు సంబంధించిన కంపెనీ, ఆయన భార్య గౌరి ఖాన్, వాటాదారులకు వ్యతిరేకంగా ఐటీ శాఖ జారీ చేసిన నోటీసును తప్పుపట్టింది.
 కమర్షియల్ లావాదేవీలకు సంబంధించి స్వతంత్ర సంస్థలో ఎలాంటి బినామీ లావాదేవీలు జరిగినట్లు తెలియరాలేదని డీ సింఘాయ్(చైర్‌పర్సన్), సభ్యుడు వీ షా ప్రత్యేక బెంచ్ వెల్లడించింది. థాల్‌లోని సర్వే నంబర్లు 188/ఏ, 188/1బీ, 188/2, 188/3, 188/4, 187/1 కింద వ్యవసాయ భూమి ఉన్నదని, ఇది బినామీ కింద కొనుగోలు చేయలేదని ప్రత్యేక బెంచ్ తెలిపింది.