Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

BJP సంకల్ప‌పత్ర తయారీ

మరికొన్ని నెలల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు చేయనున్న వాగ్దానాలతో కూడిన ఎన్నికల ప్రణాళిక `సంకల్ప్ పత్ర' తయారీ కోసం ...


మరికొన్ని నెలల్లో జరుగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రజలకు చేయనున్న వాగ్దానాలతో కూడిన ఎన్నికల ప్రణాళిక `సంకల్ప్ పత్ర' తయారీ కోసం బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై హోమ్ మంత్రి  రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలోని 20మంది సభ్యుల ఎన్నికల ప్రణాళిక కమిటీ తొలి సమావేశం ఆదివారం జరిగింది.

 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోను ఏవిధంగా రూపొందించాలన్న దానిపై కసరత్తు చేసేందుకు మొత్తం 15 ఉపకమిటీలను నియమించాలని ఈ సమావేశం నిర్ణయించింది. ‘సంకల్ప్ పత్రం’గా పేర్కొంటున్న ఈ మేనిఫెస్టో ఎలా ఉండాలన్న దానిపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించామని, అనంతరం ఈ 15 ఉపసంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. 

ముఖ్యంగా వివిధ రంగాలకు చెందిన ప్రజలతో అనుసంధానమయ్యే విధంగా ఈ ఉపకమిటీల నిర్మాణం జరుగుతుందని, ఈ కమిటీలు నేరుగానే ప్రజలతో మమేకమై వారి అభిప్రాయాల ఆధారంగా సంకల్ప పత్రానికి సంబంధించిన అంశాలను నివేదిస్తారని ఆయన వెల్లడించారు. ఈ సమావేశానికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. 

సమావేశంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్, థావర్‌చంద్ గెహ్లాట్, రవిశంకర్ ప్రసాద్, పీయూష్ గోయల్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, కేజే అల్ఫోన్స్, కిరణ్ రిజిజు, డిప్యూటీ సీఎంలు సుశీల్ కుమార్ మోదీ, కేశవ్ ప్రసాద్ మౌర్య , ఆంధ్ర ప్రదేశ్ నుండి డా. కె హరిబాబు తదితరులు పాల్గొన్నారు.