Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

కరీంనగర్ జిల్లాకు జాతీయ అవార్డు.. ఎందుకో తెలుసా..?

కేంద్ర ప్రభుత్వం దేశం లో అమ్మాయిల అభివృద్దికి కృషి చేసిన వారికి గుర్తింపు గా ఇచ్చే బేటి బచావో బేటి పడావో జాతీయ అవార్డును తెలంగా...






కేంద్ర ప్రభుత్వం దేశం లో అమ్మాయిల అభివృద్దికి కృషి చేసిన వారికి గుర్తింపు గా ఇచ్చే బేటి బచావో బేటి పడావో జాతీయ అవార్డును తెలంగాణ రాష్ట్ర౦ లోని కరీంనగర్ జిల్లాకు ఇస్తున్నట్లు ప్రకటించింది. జిల్లాలో వివిధ శాఖల అధ్వర్యంలో అమ్మాయిల అభివృద్దికి విశేష కృషి చేసినందుకు గుర్తింపుగా కేంద్రం ప్రభుత్వం ఎఫెక్టివ్ కమ్యునిటీ ఎంగేజ్మెంట్ అవార్డుకు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ను ప్రకటించింది.
దేశం లోని ఆడపిల్లల లింగ నిష్పత్తి పెంచడం, వారి అభివృద్దికి దోహదపడేలా చర్యలు చేపట్టిన 230 జిల్లాలను గుర్తించి వాటిలో బేటి బచావో బేటి పడావో పథకాన్ని మంచిగా అమలు చేస్తున్న జిల్లాలను ఎంపిక చేసి జనవరి 24 న జాతీయ బాలిక దినోత్సవం ను పురస్కరించుకొని ఈ అవార్డు ను అందజేస్తారు. గత సంవత్సరం జిల్లాలో అమ్మాయిల అభివృద్ధికి చేపట్టిన చర్యలను గుర్తించి కేంద్ర మంత్రిత్వశాఖ కరీంనగర్ జిల్లాను ఎంపిక చేసింది. బేటి బచావో బేటి పడావో పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు ఎఫెక్టివ్ కమ్యునిటీ ఎంగేజ్మెంట్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. 

జిల్లాలో కలెక్టర్ సర్ఫరాజ్ అన్ని శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు గ్రామ, మండల, జిల్లా  స్థాయి లో సమావేశాలు నిర్వహిస్తూ అంగన్ వాడి టీచర్లను, ఆశా వర్కర్లను మహిళా సంఘాల గ్రూప్ సభ్యులతో గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఆడపిల్లల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించి, వాటిని వినియోగించుకునేల చర్యలు తీసుకున్నారు. ఆడపిల్లల అభివృద్దిని కోరుతూ అందరికి తెలిసేలా పాటల రూపం లో వివరించడం. సభలు సమావేశాల్లోనే కాకుండా కూడళ్ళ వద్ద ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు.

 జిల్లాలో జిల్లా స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ తో పాటు వివిధ శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఆసుపత్రులలో భ్రూణ హత్యలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టడం, అప్పుడే పుట్టిన పసిపిల్లలకు గర్భిణులకు తగిన ఇంజక్షన్ లు ఇప్పించడం, అమ్మాయిల చదువుకు ప్రత్యేక శ్రద్ద చూపించడం, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల సహకారంతో మహిళా సంఘాల సమన్వయంతో ఆడపిల్లకు తోడ్పాటు అందించడం వంటి అనేక కార్యక్రమాలు చేయడం వలన కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈ అవార్డును అందజేసింది.