Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మావోఇష్ట్ ల ఘాతుకాలు

తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టులను  పూర్తిగా కట్టడి చేశామని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భరోసా వ్యక్తం చేస్తుండగా అక్కడక్కడా వారు ...


తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టులను  పూర్తిగా కట్టడి చేశామని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు భరోసా వ్యక్తం చేస్తుండగా అక్కడక్కడా వారు విధ్వాంసాలు, హింసాయుత కార్యక్రమాలకు దిగుతూనే ఉన్నారు. అరకు ఎమ్యెల్యేను, మాజీ ఎమ్యెల్యేను హత్య కావించడంతో పాటు పలు చోట్ల విధ్వంసాలకు పాల్పడుతున్నారు. 
తాజాగా కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న మావోయిస్టులు మంగళవారం రాత్రి పేట్రేగిపోయారు. 30వ నెంబరు జాతీయ రహదారిపై ఒక ఆర్టీసీ బస్సు, గూడ్స్ లారీకి నిప్పంటించి దగ్థంచేశారు. ఈ ఘటన చింతూరు మండలంలోని సరివెల గ్రామ శివార్లలో మంగళవారం రాత్రి 8గంటల సమయంలో చోటు చేసుకుంది.
 తెలంగాణ రాష్ట్రం తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మండలంలోని చిడుమూరు గ్రామం నుంచి హైదరాబాద్‌కు రాత్రి 8 గంటల సమయంలో ప్రయాణికులతో బయల్దేరింది. సరివెల గ్రామ శివార్లలో జాతీయ రహదారిపై మాటువేసిన మావోయిస్టులు బస్సుకు అడ్డంగా వచ్చి నిలిపివేశారు. ప్రయాణికులను కిందకు దింపి, బస్సు ఇంజిను కింద తాటాకులు, గడ్డి పేర్చి నిప్పంటించారు. ఆ సమయంలో భద్రాచలం నుంచి చింతూరు వైపునకు వస్తున్న గూడ్సు లారీని కూడా ఆపి, డీజిల్ ట్యాంకును ధ్వంసంచేసి నిప్పంటించారు.
ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకూ మావోయిస్టు వారోత్సవాలు జరుగుతున్నాయని, ఈ నెల 31న మావోయిస్టుల పిలుపిచ్చిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలంటూ నినాదాలుచేశారు. అక్కడ నుంచి మావోయిస్టులు అటవీ ప్రాంతంలోకి నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో మావోయిస్టులు ఆయుధాలతో పాల్గొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
మావోయిస్టులు తమను సురక్షితంగా విడిచిపెట్టడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మావోయిస్టులు వెళ్లిపోయిన తర్వాత ప్రయాణికులంతా చింతూరు వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కి చింతూరు చేరుకున్నారు. చింతూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ప్రయాణికులు ఘటన వివరాలు తెలిపారు. చింతూరు సీఐ దుర్గాప్రసాద్ వెంటనే పోలీసు బలగాలతో చట్టీ జంక్షన్‌కు చేరుకుని భద్రాచలం వైపు వెళ్లే వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
సంఘటనా స్థలంలో మావోయిస్టు దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ పేరున ఒక కరపత్రాన్ని విడిచి వెళ్లారు. దీంట్లో ఈ నెల 25నుంచి 31వ తేదీ వరకూ మావోయిస్టు వారోత్సవాలను విజయవంతం చేయాలని, అలాగే 31న మావోయిస్టులు పిలుపునిచ్చిన భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ఉంది. కాగా ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్టు సీఐ దుర్గాప్రసాద్ తెలిపారు.