Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అమెరికా రాజకీయాల్లో భారతీయ మహిళ

అమెరికా రాజకీయాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న పలువురు భారతీయ అమెరికన్లు దేశ అధ్యక్ష పదవికీ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. భారత సంతతి...


అమెరికా రాజకీయాల్లో ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్న పలువురు భారతీయ అమెరికన్లు దేశ అధ్యక్ష పదవికీ పోటీ పడేందుకు సిద్ధమయ్యారు. భారత సంతతికి చెందిన సెనెటర్ కమలా హ్యారిస్ 2020లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై పోటీకి దిగుతానని తాజాగా సోమవారం ప్రకటించారు. మహాత్మాగాంధీ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకున్న మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ జయంతిని అమెరికన్లు జరుపుకుంటున్న సమయంలో తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని ప్రకటించడం గర్వంగా ఉందని కమల పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న తొలి భారత సంతతి సెనేటర్‌గా ఆమె రికార్డులకెక్కారు .  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వలస విధానాలను తీవ్రంగా విమర్శించే ఆమె ‘గుడ్ మార్నింగ్ అమెరికా’ అనే టీవీ షో సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
 ట్రంప్ విధానాలను విమర్శిస్తూ కమలా హ్యారిస్ ఇటీవల వార్తల్లో నిలుస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవి నామినేషన్ కోసం పోటీ పడుతున్న వారిలో హ్యారిస్ నాలుగో వ్యక్తి. నేను అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నా అని ఆమె ట్వీట్ చేశారు. కమలా హ్యారిస్: ప్రజల కోసం అన్న నినాదం తన ప్రచారాంశమని తెలిపారు. 
కమలా హారిస్‌(54) తల్లిదండ్రులు భారత్, జమైకా నుంచి వలసవచ్చారు. ‘కలసికట్టుగా ప్రయత్నించండి. మన కోసం, మన పిల్లల కోసం మన దేశం కోసం మన భవిష్యత్తును మార్చుకుందాం’ అని తన ప్రచార వీడియోను ఆ షో సందర్భంగా విడుదల చేశారు.
హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్‌ కింగ్ జూనియర్ గౌరవార్థం జరుపుకొనే రోజునే ఆమె దాన్ని విడుదల చేశారు. అభ్యున్నతి కోసం చేసిన పోరాటానికి గుర్తుగా ఆమె ఈ రోజును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్ర మాజీ అటార్నీ జనరల్‌ అయిన కమల..ట్రంప్‌ విమర్శకురాలిగా పేరు పొందారు. ట్రంప్‌ నియామాకాల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పన్నులు, వలస విధానాలు, ఆరోగ్య సేవలు వంటి అంశాలపై ఆమె ప్రచారంలో ప్రధానం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.