బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్ యూనియన్(ఈయూ) నుంచి బయటకు రావాలని బ్రిటన్ నిర్ణయించిన విషయం తెలిసింద...
బ్రిటన్ ప్రధాని థెరిసా మేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూరోపియన్
యూనియన్(ఈయూ) నుంచి బయటకు రావాలని బ్రిటన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ
నేపథ్యంలో ఈయూతో కుదుర్చుకున్న ఒప్పందంపై బ్రిటన్ పార్లమెంట్‌లో
నిర్వహించిన చారిత్రక ఓటింగ్‌లో ఆమె ఓటమి పాలయ్యారు. థెరెసా మే
ప్రవేశపెట్టన బ్రెగ్జిట్ బిల్లును బ్రిటన్ పార్లమెంట్ తిరస్కరించింది.
బుధవారం జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు వ్యతిరేకంగా 432 మంది సభ్యులు ఓటేయగా, అనుకూలంగా 202 మంది ఎంపీలు ఓటేశారు. దీంతో 230 ఓట్ల తేడాతో బ్రెగ్జిట్ ఒప్పందాన్ని బ్రిటన్ ఎంపీలు తిరస్కరించారు. ఒప్పందంపై భారత సంతతికి చెందిన ఏడుగురు బ్రిటన్ ఎంపీలు కూడా బ్రిగ్జిట్‌కు వ్యతిరేకంగా ఓటేశారు.దీంతో ఆమె విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది.
యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి వైదొలగాలని బ్రిటన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రిటన్ పార్లమెంట్‌లో కీలక ఓటింగ్ నిర్వహించారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా 432 మంది ఓటేయగా.. 202 మంది అనుకూలంగా ఓటేశారు. దీంతో ఓటింగ్‌లో థెరిస్సా ఓటమి పాలయ్యారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటేయాలన్న మే అభ్యర్థనను సభ్యులు పట్టించుకోలేదు. బ్రెగ్జిట్ కోసం యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో బ్రిటన్ కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఈయూ నేతలు ఇదివరకే ఆమోదించిన విషయం తెలిసిందే.
ఓటింగ్‌లో ఓటమి నేపథ్యంలో ప్రతిపక్ష లేబర్ పార్టీ థెరిసా మే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఒకవేళ అవిశ్వాస తీర్మానం నెగ్గితే మెజార్టీ రాజకీయపక్షం విశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందుకు 14 రోజుల వ్యవధి ఉంటుంది. గడువులోగా విశ్వాస తీర్మానంలో సదరు పక్షం గెలవకపోతే బ్రిటన్‌లో ఎన్నికలు అనివార్యం కానున్నాయి.
అయితే బిల్లుపై బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం లభించడం అంత సులభమైన విషయం కాదు. ప్రధాని థెరెసా మే కుదుర్చుకున్న ఒప్పందం బ్రిటన్‌కు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఆమె సొంత మంత్రివర్గంలోని వ్యక్తులే రాజీనామా చేసి వెళ్లిపోవడం, సొంత పార్టీ ఎంపీలే మేపై అవిశ్వాస నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఇది బ్రిటన్‌కు ఎంతో మేలు చేసే ఒప్పందమేననీ, ఇంతకన్నా మంచి ఒప్పందాన్ని ఎవరూ కుదర్చలేరనీ ఆమె వాదిస్తున్నప్పటికీ చాలా మంది ఆమెకు వ్యతిరేకంగానే ఉన్నారు.
పార్లమెంట్‌లో బిల్లు వీగిపోవడంతో రానున్న కాలంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. పార్లమెంట్ ఆమోదం లేకుండా బయటకు రావల్సి రావచ్చు లేదా, కొత్త ఒప్పందం కోసం థెరెసా మరోసారి చర్చలు కూడా ప్రారంభించే అవకాశం ఉంది.