నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఈ చిత్రం ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో ...
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యన్.టి.ఆర్’. ఈ చిత్రం ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’ టైటిల్స్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ‘కథానాయకా..’ అనే పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలోని ‘రాజర్షి..’ అనే రెండో పాటను ఈరోజు విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పాట విడుదలను వాయిదా వేశారు. డిసెంబర్ 12 ఉదయం 10.31 నిమిషాలకు పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది. పోస్టర్‌లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ గోడపై నాగలి బొమ్మను గీస్తున్నట్లుగా ఆసక్తికరంగా ఉంది.
ఈ చిత్రానికి ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. మిగిలిన పాటల్ని కూడా ఈ నెలలోనే విడుదల చేస్తారట. ఈ చిత్రంలో ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్, అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్యామేనన్ నటిస్తున్నారు. జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎన్ బి కే ఫిల్మ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా సంస్థలపై నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలు జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.