జోరు మీదున్న కారు

హైదరాబాద్‌: తెలంగాణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు తెరాస 82, ప్రజాకూటమి 13 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అధికార తెరాస స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. తెరాస అధినేత కేసీఆర్‌ సహా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రజాకూటమి అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ తదితరులు తెరాస అభ్యర్థులపై వెనుకంజలో కొనసాగుతున్నారు. కూకట్‌పల్లిలో తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసినిపై తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో ఉండగా.. నాగార్జునసాగర్‌లో జానారెడ్డిపై నోముల నర్సింహయ్య, కొడంగల్‌లో రేవంత్‌పై పట్నం నరేందర్‌ రెడ్డి, అందోల్‌లో దామోదర రాజనర్సింహపై చంటి క్రాంతికిరణ్‌, మధిరలో భట్టి విక్రమార్కపై లింగాల కమల్‌రాజ్‌ ఆధిక్యంలో ఉన్నారు.

Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]