Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఇద్ద‌రు చంద్రుల మ‌ధ్య మాట‌ల యుద్దం

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల మ‌ధ్య మాట‌ల యుద్దం ముదిరింది, ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు.. ఒక‌రు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర...

రెండు తెలుగు రాష్ట్రాల‌లో ఇప్పుడు ఇద్ద‌రు చంద్రుల మ‌ధ్య మాట‌ల యుద్దం ముదిరింది, ఆ ఇద్ద‌రూ ఎవ‌రో కాదు.. ఒక‌రు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయితే… మ‌రొక‌రు ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ . తెలంగాణ ఎన్నికలు ముగిసినా.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాత్రం..మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరిద్ద‌రి మ‌ధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భ‌గ్గుమంటోంది.
జాతీయ స్థాయిలో దృష్టి పెట్టిన ఇద్ద‌రు చంద్రులు ఇత‌ర రాష్ట్రాల‌ను చుట్టేసి వ‌చ్చారు. బాబు బిజేపియేత‌ర ప‌క్షాల‌ను దేశంలో ఏకం చేయాల‌ని న‌డుం బిగించారు. కాంగ్రెస్‌తో దోస్తీ క‌ట్టీ బిజేపికి ఝ‌ల‌క్ ఇచ్చారు . నాలుగేళ్ల దోస్తీకి క‌టిఫ్ చెప్పి హ‌స్తంతో జ‌త‌క‌ట్టారు. అయితే దీనికి భిన్నంగా తెలంగాణ సిఎం కేసీఆర్‌… కాంగ్రెస్‌, బిజేపి ల‌కు వ్య‌తిరేకంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరిట ఇత‌ర రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను జ‌ట్టు క‌ట్టేందుకు క‌స‌ర‌త్తులు ముమ్మ‌రం చేశారు. ప‌నిలోప‌నిగా హ‌స్తిన‌లో మ‌కాం వేసి ప్ర‌ధాని మోదీకి రాష్ట్ర స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం ఇచ్చారు. హస్తిన నుండి తిరిగి వచ్చిన తరవాత ఉన్నట్లుండి సిఎం కెసిఆర్.. చంద్రబాబు మీద తీవ్ర పదజాలంతో విరుచుపడడంతో.. తెలుగు తమ్ముళ్లు అంతేస్థాయిలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్నారు.
Chandrababu, KCR
కెసిఆర్ అన్న ప్రతిమాటను ఆయనకే వర్తించేలా ఆంధ్రా మంత్రులు మాటకు మాట సమాధానం చెప్పారు. ఇటు వీరికి ధీటుగా గులాబీ దండు తీవ్రంగానే ప్ర‌తిస్పందించింది. ఇక అగ్గికి ఆజ్యం పోసిన‌ట్లు మీడియా ప్రతినిధులు కెసిఆర్ వ్యాఖ్యలపై స్పందనని. చంద్రబాబును కోరడంతో.. నాయకుడంటే విజ్ఞత, సంస్కారం ముఖ్యమంటూ తెలంగాణ చంద్రుడికి చురకలంటించారు. కెసిఆర్ మాట్లాడిన ప్రతిమాటకు అంతేఘాటుగా హుందాగానే సమాధానం ఇచ్చారు.
చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్ దగ్గర నుండి పార్టీ లాక్కున్నాడన్న కెసిఆర్ మాటలకు ఆనాడు నాతో ఉండి వైశ్రాయ్ హోటల్ కథ నడిపించింది నువ్వు కాదా అని చంద్రబాబు నిల‌దీశారు .
కేంద్రంలో ప్రధాని మోడీ.. ఆంధ్రాలో జూనియర్ మోడీ జగన్ అయితే.. కెసిఆర్ మిడిల్ మోడీలా తయారయ్యారన్నారు బాబు. కావాలంటే అందరూ కట్టకట్టుకుని పోటీకి రండి మేము స్వాగతిస్తాం. . కానీ ప్రజాస్వామ్యంలో భాష మనిషి విలువను సూచిస్తుంది అంటూ గరం గరం అయ్యారు.
రిట‌ర్న్‌ గిఫ్ట్ ఇస్తా అంటున్న కెసిఆర్.. నువు ఒకసారి గిఫ్ట్ ఇస్తే నేను అంతే వేగంతో తిరిగి గిఫ్ట్ ఇస్తా అంటూ బాబు రెచ్చిపోయారు. మొత్తంగా చూస్తే తెలుగు రాష్ట్రాల‌లో చంద్రుల మాట‌ల‌ రాజకీయం రంజుగా సాగుతోంది.
మ‌రి ఈ మాటల యుద్ధం ఎక్కడకి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.