Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అండమాన్ దీవుల పేర్లు మార్పు మోడీ

అండమాన్ నికోబార్‌లోని మూడు దీవుల పేర్లను మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అండమాన్‌లో నేతాజీ సుభాష్ చంద...


అండమాన్ నికోబార్‌లోని మూడు దీవుల పేర్లను మారుస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అండమాన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఆదివారంతో 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయా దీవుల పేర్లను మారుస్తున్నట్లు తెలిపారు. రోస్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్, నీల్ దీవికి షహీద్ ద్వీప్, హవేలాక్ దీవికి స్వరాజ్ ద్వీప్ అని పేర్లు పెడుతున్నామని చెప్పారు. అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించిన ప్రధాని మోదీ నేతాజీ సంస్మరణార్థం పోస్టల్ స్టాంప్, రూ.75 నాణేన్ని ఆవిష్కరించారు. అండమాన్‌లో డీమ్డ్ యూనివర్సిటీని స్థాపిస్తామన్నారు. మెరీనా పార్క్‌ను సందర్శించిన మోదీ.. 150 అడుగుల ఎత్తు గల త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఇదే పార్క్‌లో గల సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ వలస పాలనలో జాతీయోద్యమంలో పాల్గొని జైలు పాలైన అమర వీరులకు సెల్యూలార్ జైలు వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. కార్ నికోబార్ దీవుల్లో జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ స్థానికులకు మెరుగైన వసతులను కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.ఏటేటా సముద్ర కోతతో ఇబ్బందుల పాలవుతున్న కర్ నికోబార్ దీవుల సమస్య పరిష్కారానికి గోడ నిర్మిస్తామని తెలిపారు. 2004 సునామీ ప్రభావం నుంచి బయటపడినందుకు కార్ నికోబార్ దీవుల ప్రజలను అభినందించారు. 2004 సునామీ మృతులకూ మోదీ నివాళులర్పించారు.