Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

హిట్ కోసం పీరియాడిక్ ‘బాణం’

ఒక దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతో చెైతన్య దంతులూరి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ… ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ ...

ఒక దర్శకుడిగా తన మొదటి చిత్రమైన ‘బాణం’ చిత్రంతో చెైతన్య దంతులూరి మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ… ఆ తరువాత బసంతి చిత్రంతోనూ తాను టాలెంటెడ్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నే ప్రయత్నం చేశాడు. అయినా చెైతన్య దంతులూరి కమర్షల్ గా మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. ఆ లోటును ఈ సారి ఎలాగైనా తీర్చుకోవాలని.. ఇప్పుడు చెయ్యబోయే చిత్రంతో భారీ సక్సెస్ కొట్టాలని చెైతన్య ఓ పీరియాడిక్ స్టోరీని ఎంచుకున్నాడు.
కాగా, 1971 కాలంలో యుద్ధం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ చిత్రంలో ‘నారా రోహిత్’ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. సాధ్యమైనంత త్వరలోనే షూట్ కి వెళ్ళనుందని తెలుస్తోంది.
Nara Rohit, chaitanya dantuluri
ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చెైతన్య దంతులూరి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరి ఈ చిత్రం చేస్తున్నారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.