Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మొండి బకాయిలపై రిజర్వు బ్యాంక్ వేగవంతం

మొండి బకాయిలపై రిజర్వు బ్యాంక్ సందించిన దివాలాచట్టం అస్త్రం దెబ్బకు రుణాలు తీసుకున్నవారు దిగిరాక తప్పడం లేదు. ఐబీసీ, సర్ఫేసి చట్టం ప్రకార...

మొండి బకాయిలపై రిజర్వు బ్యాంక్ సందించిన దివాలాచట్టం అస్త్రం దెబ్బకు రుణాలు తీసుకున్నవారు దిగిరాక తప్పడం లేదు. ఐబీసీ, సర్ఫేసి చట్టం ప్రకారం రుణాల చెల్లింపుదారులపై బ్యాంకులు కఠిన చర్యలు తీసుకోవడంతో గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40,400 కోట్ల రుణాలు తిరిగి వసూలయ్యాయి. 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వు బ్యాంక్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతక్రితం ఏడాదిలో రూ.38,500 కోట్లుగా ఉన్నాయి.
మొండి బకాయిలను తిరిగి వసూలు చేయడానికి దివాలా చట్టం, సర్ఫేస్ యాక్ట్, డెబిట్ రికవరీ ట్రిబ్యునల్, లోక్ అదాలత్ వంటి మార్గాల ద్వారా వసూలు చేసే అవకాశం బ్యాంకులకు ఉన్నది. వసూలు చేసిన వాటిలో దివాలా చట్టం కింద రూ.4,900 కోట్లు, సర్ఫేస్ చట్టం ప్రకారం రూ.26,500 కోట్లు వసూలు చేసినట్లు ఈ వార్షిక నివేదికలో తెలిపింది. 
బ్యాంకులు తీవ్రమైన ప్రయత్నాలు చేయడం వల్లనే మొండి బకాయిల వసూళ్లు పెరిగాయని, దీనికి తోడు సర్ఫేస్ యాక్ట్ ప్రకారం ఆస్తులు వివరాలు, నెల రోజుల్లో ప్రాసెసెషన్ చెయ్యనివారికి మూడు నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉండటంతో భారీ స్థాయిలో రుణాలు రీకవరి అయ్యాయి.
ఇదే సమయంలో లోక్ అదాలత్, డీఆర్‌టీఎస్‌ల కింద కేసులు తగ్గుముఖం పట్టగా, ఒత్తిడిలో ఉన్న ఆస్తులపై దివాలా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం ఇందుకు పరోక్షంగా దోహదం చేస్తున్నాయి. దివాలా చట్టం ప్రాసెస్‌కోసం చర్యలను వేగవంతం చేయడం, ఎన్‌సీఎల్‌టీఎస్ కింద మరిన్ని బెంచ్‌లను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఐబీసీ కింద కేసుల పరిష్కారం వేగవంతం అయిందని నివేదికలో ఆర్బీఐ అభిప్రాయపడింది. 
బ్యాలెన్స్ షీట్స్‌ను నిరంతరాయంగా పర్యవేక్షించడంతోపాటు వీటిని పునర్‌వ్యవస్థీకరించుకోవాలని, అలాగే, బ్యాంకులు/ఎన్‌బీఎఫ్‌సీఎస్/ఆర్థిక సేవల సంస్థలు కూడా తమవంతుగా కోతలు విధించుకోవాలని నివేదిక సూచించింది. తాకట్టుకింద పెట్టిన ఆస్తుల విక్రయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు చర్యల్లో వేగం పెంచాయని, వివిధ మార్గాల్లో తమ అప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేశాయని తెలిపింది.