Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ప్రభాస్ కి బాలీవుడ్ సవాల్

బాహుబలితో వరల్డ్ రేంజ్ హీరోగా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అయితే అందరి దృష్టి భారీ బడ్జెట్ సినిమా అయిన సాహో ప...

Related image
బాహుబలితో వరల్డ్ రేంజ్ హీరోగా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు.అయితే అందరి దృష్టి భారీ బడ్జెట్ సినిమా అయిన సాహో పైనే ఉంది.ఆ సినిమాని ఏకంగా 300 కోట్ల పైచిలుకు బడ్జెట్ తో యాక్షన్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన షేడ్స్ ఆఫ్ సాహో తోనే ఆ సినిమా రేంజ్ ఏంటి అనేది అందరికి అర్ధమయింది.ఇప్పటికే ఆ సినిమా హిందీ వెర్షన్ కి ఏకంగా 250 కోట్లకు పైగా డీల్ కుదరడంతో బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు.సాహో సినిమాని 2019 ఆగస్టు 15 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇంత ముందుగా డేట్ ఇచ్చేసారు కాబట్టి తెలుగులో ఆ టైం లో ఎవ్వరూ కూడా సినిమా వెయ్యరు.ఒక వేళా వేసిన కూడా సాహో హోరు,జోరు ముందు అవి నిలబడడం కష్టం.ఇప్పడు అసలు సమస్య హిందీ వెర్షన్ తో.బాహుబలి-2 బాలీవుడ్ లో ఏకంగా 500 కోట్లకుపైగా కొల్లగొట్టింది కనుక 250 కోట్ల రేటు చాలా రీజనబుల్.కానీ సాహో రిలీజ్ డేట్ నే బాలీవుడ్ లో మరో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.వాటిలో ఒకటి అక్షయ్ కుమార్ నటించిన మిషన్ మంగళ్ కాగా,మరొకటి జాన్ అబ్రహాం నటించిన బాట్ల హౌస్.అక్షయ్ కుమార్ సినిమాలకు బాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే.
పైగా ఇప్పడు అక్కి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.టాయిలెట్,ప్యాడ్ మ్యాన్,గోల్డ్..ఇలా వరస విజయాలతో దూసుకుపోతున్నాడు.మరి ఆ దూకుడు ని తట్టుకుని సాహో భారీ వసూళ్లు రాబట్టాలంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అనే టాక్ తప్పనిసరి.చాలా చోట్ల అండర్ మార్క్ అని టాక్ వచ్చిన 2.0 బాలీవుడ్ లో భారీ లాభాలు రాబట్టడానికి అక్షయ్ కుమార్ కూడా ఒక కారణం.ఇక బాట్ల హౌస్ డి ఒక విచిత్రమయిన పరిస్థితి.సాహో హిందీ రైట్స్ తీసుకున్న T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ బాట్ల హౌస్ తో కూడా అసోసియేట్ అయ్యాడు.మరి సాహో గురించి బాట్ల హౌస్ ని అవుతాడా అనేది క్వశ్చన్ మార్క్.ప్రస్తుతానికయితే బాలీవుడ్ ని కూడా కన్సిడర్ చేసి మరీ సాహో ని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఆ టీమ్ బాలీవుడ్ లో పోటీని ఎలా ఎదుర్కొంటుంది?,ఏ స్ట్రాటజీ ఫాలో అవుతుంది అనేది వెయిట్ చేసి తెలుసుకోవాలి.