Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

మోడి జీ‌ మరలా మీరే మా ప్రదాని

2019, భారత్ రాజకీయాల్ని పెద్ద మలుపే తిప్పుతుంది... ఫిబ్రవరి లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది... దేశమంతా సార్వత్రిక ఎన్నికలు ఏప్...


2019, భారత్ రాజకీయాల్ని పెద్ద మలుపే తిప్పుతుంది...
ఫిబ్రవరి లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుంది...
దేశమంతా సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ లో జరుగుతాయి..
5 రాష్ట్రాల ఎన్నికల్లో సమాధి నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ మమ్మీ , దుకాణాలు రేపో మాపో మూసేసే ఇతర పార్టీలు కలిసి బీజేపీ పై ముఖ్యంగా నరేంద్రమోదీ పై భీకర యుద్ధం చేస్తారు...
వాళ్లకు ఈ ఎన్నికలు చావో రేవో మరి...
నరేంద్రమోదీ తిరిగి వచ్చేడో వీళ్లంతా అవినీతి కేసుల్లో జైల్లో మగ్గవలిసినదే...
లేక ఈ అవినీతి డ్రాకులా లు వచ్చేరో దేశం భారీ మూల్యం చెల్లించుకోవాలి..
ఇంక పట్టుమని 4 నెలలు..
ఇప్పుడిపుడే నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి పధకాలు ఓ రూపు దిద్దుకుంటున్నాయి...
అన్నిరంగాల్లో చాలా వరకు నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన 126 పధకాలు అమల్లోకి వచ్చేసేయి.         
జనధన్ నుండి ఆయుష్మాన్ భారత్ వరకు అమల్లో ఉన్నాయి..
గతితప్పిన దేశ ఆర్థిక వ్యవస్థ కు కాయకల్ప చికిత్స చేసి ప్రగతి పధం లో దేశాన్ని అభివృద్ధి దేశాల సరసన నిలబెట్టారు.
రక్షణ రంగంలో అణు జలాంతర్గామి , రఫెల్ యుద్ధ విమానాలతో , S- 400 లాంటి క్షిపణి లతో , సరిహద్దు  వెంబడి లేజర్ కంచె తో , అగ్ని, బ్రహ్మోస్ లాంటి స్వదేశీ  ఆయుధ సంపత్తితో భారత్ ను శత్రు దుర్భేద్యం చేసేరు.
విదేశాలతో అనేక ద్వైపాక్షిక సంబంధాలను చేసుకుని డాలర్ ని నియంత్రించి ముడి చమురును రూపాయలకు కొంటున్నారు..
విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను జుట్టుపట్టి ఈడ్చుకుని వచ్చి ఆస్తులు జప్తుచేసి బ్యాంక్ ల మొండి బకాయిలను తీర్చేలా చేస్తున్నారు..
రోడ్లు , రైల్వే లు , విద్యుత్ , మొబైల్, అంతరిక్ష రంగాల్లో రికార్డ్ స్థాయిలో అనితర సాధ్యమైన ప్రగతి సాధించేరు..
దిగుమతులు తగ్గించి మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎగుమతులు పెంచి విదేశిమారక ద్రవ్యం ఇబ్బడి ముబ్బడిగా పెంచేరు..
ముద్ర రుణాలు ద్వారా చిన్న మధ్యతరహా పరిశ్రమ లకు చేతివృత్తుల కు ఊపిరి పోసి లక్షలాదిమంది కి ఉపాధి కల్పించేరు..
వ్యవసాయ రంగంలో రైతులకు 2 రెట్లు ఆదాయం సాధించేదిశగా అనేక చర్యలు చేపెట్టారు.
1.5 మద్దతు ధర ఇచ్చేసేరు. వేప పూత యూరియా, పంటల భీమా , ఈనాం ద్వారా రైతుకు ఎన్నో ఉపశమనాలు చేకూర్చేరు..
ఇక రైతుల్లో అధిక ఉత్పత్తి నైపుణ్యాలు పెంచటమే మిగిలిఉన్నది.
ఎలాగో అన్నదాత అప్పుల ఊబిలో కురుకుపోకుండా 6 లక్షల నిధులు విడుదలతో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ పధకం ఈ బడ్జెట్ లో వస్తుంది..
పారిశ్రామిక నడవాలు , స్మార్ట్ సిటీస్ , హై స్పీడ్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ హైవే లు , వాటర్ వేస్ , భూగర్భ టన్నెల్స్ , ఈశాన్య రాష్ట్రాల్లో బ్రిడ్జి లు , చార్ ధామ్ రహదారులు పునరుద్దరణ, ఆంధ్రప్రదేశ్ లో పోలవరం , దేశ రక్షణ రంగం ఆధునీకరణ లాంటి వి నడి మధ్యలో ఉన్నాయి..
2022 నాటికి కోటి గృహాలు నిర్మాణం శరవేగంగా సాగుతుంది..
నైపుణ్యాల అభివృద్ధి ద్వారా దేశంలో యువతకు శిక్షణ ఇస్తూ , స్టార్ట్ అప్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా , స్కిల్ ఇండియా లాంటి పధకాలు ప్రవేశపెట్టారు.
మహిళలు కు , శిశువులకు, వృద్దుల కు ఎన్నో పధకాలు భేటి బచావో భేటి పడావో , సుకన్య సమృద్ధి యోజన , మాతృత్వ వందన , వయోజన వందన ద్వారా ఎంతో సహాయం చేస్తున్నారు..
సంజీవిని ద్వారా మందులు ధరలు తగ్గించి , స్టంట్ లు జాయింట్ లు ధరలు తగ్గించి రోగులకు ఎంతో సేవ చేస్తున్నారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల ప్రజలకు 5 లక్షల విలువచేసే ఆరోగ్య భీమా అమలు చేస్తున్నారు..
వికలాంగులకు ఎన్నో ఉపకరణాలు ఇచ్చేరు..
సైనికులకు ఎంతో మేలు చేసే ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్ తో బాటు , పోరాటాల్లో అసువులు బాసిన వీరుల కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్ధిక సహాయం ఇస్తున్నారు..
ఇంక కేవలం హిందువుల ఆరాధ్య దైవం శ్రీరామ మందిర్ పై ఆర్డినెన్సు , ఒకే దేశం ఒకే చట్టం దిశగా కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు మాత్రమే మిగిలిఉన్నాయి..
పోయేటప్పుడు మంచిచేసే వెళ్తాం అన్న నరేంద్రమోదీ మాటలు గుర్తుఉన్నాయి కదా..
ఇవి కూడా అయిపోతాయి ఈవేళ రేపట్లో..
60 ఏళ్ళు చెడగొట్టబడిన దేశాన్ని బాగు చేయటానికి 60 నెలలు టైం సరిపోవట్లేదు..
చెడగొట్టటానికి అయినా బాగు చేయటానికి అయినా ఓ దశాబ్ద కాలం పడుతుంది..
యూపీఏ 10 ఏళ్ల పాలనలో దేశంలో అన్ని వ్యవస్థలు సర్వ భ్రష్టం అయిపోయినవి.
ఒక ప్రక్క లూటీన్ బంగాళా లాబీ నుండి , 10 జన్ పథ్ రిమోట్ కంట్రోల్ నుండి , చిదంబరం ఆర్ధిక మాయాజాలం నుండి , కపిల్ సిబల్ కోర్ట్ కేస్ ల నుండి , కాంగ్రెస్ పోషిత మీడియా కుక్కల నుండి దేశాన్ని కాపాడుతూ మరో ప్రక్క దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించటం సామాన్యమైన విషయం ఏమీ కాదు..
వామన అవతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువు వలె మూడో ప్రక్క అవినీతి బలిని పాతాళం లోకి తొక్కుతున్నారు నరేంద్రమోదీ..
ప్రపంచ దేశాల్లో భారత్ ప్రతిష్ఠ ను ఇనుమడించి భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దే సమయం లో..
అహోరాత్రులు అలుపు ఎరగక దేశమాత సేవలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేస్తున్న కర్మయోగి ని , అంతకుముందు వాజపేయి గారిలా ఓడిస్తే ఏమవుతుంది ?
ఈ దేశానికి నేను అవసరం లేదు అని ప్రజలు భావించినపుడు నేను మౌనం గా నిష్క్రమిస్తాను అని చెప్పిన నరేంద్రమోదీ తాను ఒకప్పుడు తపస్సు చేసుకున్న కేదారనాథ్ ప్రాంతంలో గరుడచట్టి లో తన పూర్వ ఆశ్రమానికి వెళ్ళిపోతారు..
ఆ తరువాత..?
రక్షణ రంగంలో కమిషన్ లేని ఒప్పందాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎన్నడూ లేవు , రఫెల్ లో కూడా ఉండే ఉంటాది అని గోబెల్ ప్రచారం చేసిన అబద్ధాలు కోరు రాహుల్ ని ప్రధాని గా ఎన్నుకుందామా ?
పాకిస్తాన్ నుండి ఉగ్రవాదం చైనా నుండి సామ్రాజ్య వాదం హాయిగా అనుభవిద్దామా ?
'పెద్ద నోట్లు రద్దు' రద్దు చేసి ఇంకా దాచి ఉన్న పాత నోట్లు చెల్లుబాటు చేసి నల్ల డబ్బు కుప్పలు గా పోగేసి దోచుకుందాం దాచుకుందాం అని పాటలు పాడుకుందామా ?
జిఎస్టీ రద్దు చేసి పన్నులు ఎగ్గొట్టి దేశప్రగతి అన్ని రంగాలలో కుంటుపడి భవిష్యత్ తరాలు బ్రతుకులు నాశనం కావాలి అని కోరుకుందామా ?
రిజర్వ్ బ్యాంక్ లో 27% శాతం నిల్వపెట్టి , ప్రభుత్వ బ్యాంకుల్లో సొమ్ము కొల్లగొట్టి , బ్యాంక్ దివాళా చట్టం రద్దు చేసి విజయ్ మాల్యా , నిర్వ మోడీ, సుజనా చౌదరి జిందాబాద్ అని ఫెక్సీ లు కట్టి సన్మానాలు చేద్దామా ?
బినామీ చట్టం రద్దు చేసి రాజకీయ నాయకుల కు అవినీతి అధికారుల కు దేశం నలుమూలల మీద లక్షల ఎకరాలు , రాజభవనాలు , బంగారు సింహాసనాలు ఏర్పాటు చేద్దామా ?
సీబీఐ ఏసీబీ రద్దు చేసి ఇండియా ని పన్ను ఎగవేతదారులు స్వర్గధామం గా తయారు చేద్దామా ?
పప్పులు పప్పలు పండగకి మాత్రమే తిని మిగతా రోజుల్లో గడ్డి తిని బ్రతుకుదామా ?
ఆయుష్మాన్ భారత్ రద్దు చేసి రోగం వస్తే వైద్యం లేక ప్రభుత్వ ఆసుపత్రి గేట్ ముందు కుక్క చావు చద్దామా ?
ఎరువులు దొరకక , మద్దతు ధర దొరక్క , అప్పు పుట్టక , పంటభీమా రాక , అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ దినం భోజనాలు కు కూడా వెళదామా ?
2022 నాటికి ప్రతి కుటుంబానికి ఇళ్ళు లేక మురికి వాడల్లో , ఫ్లాట్ ఫార్మ్ మీద , డివైడర్ ల మీద నిద్రపోదామా ?
ఖరీదైన మోటార్ సైకిళ్ళు , కార్లు మీద వెళ్లి రేషన్ బియ్యం కొట్టేసి వాటిని మళ్ళీ అమ్మేసి , పేద వాళ్ళ నోటి కాడ గెంజి కూడా తాగేద్దామా ?
వంటగ్యాస్ మీద ఇంకా సబ్సిడీ దొబ్బుతూ , వాటిని తిరిగి అమ్ముకుంటూ , పేద తల్లుల ఊపిరితిత్తులు కట్టెల పొయ్య పొగ తో నింపేసి చంపేద్దామా ?
ఇన్కమ్ టాక్స్ ఎగొట్టేసి ఎడాపెడా పోగేసి పేద ధనిక అంతరం పెంచేసి దరిద్ర ప్రజలు - ధనిక నాయకులు గల దేశం అని పేరు తెచ్చుకుందామా..?
ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకుని రోజుకు రూపాయి పావలా చొప్పున మన బిడ్డలు భవిష్యత్ టోకుగా అమ్మేద్దామా ?
ఏమి చేద్దాం ? చెప్పండి ? ఛాయిస్ మీదే !
మోడీ ఇంకో సారి అందామా ?
లేకపోతే కాంగ్రెస్ మమ్మీ లెగు, దేశాన్ని అమ్మేయి అందామా ?
అప్పుడు "ధు మీ బ్రతుకు చెడా" అంటుంది ప్రపంచ మొత్తం !
(దాసరి వాసుదేరావు)