Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ప్రణీత మనసు అందమైనది.

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో బాపు బొమ్మగా మెరిసిన ప్రణీత.. తన రూపమే కాదు, తన మనసు కూడా చాలా అందమైనదని ఓ ...

 Pranita Subhash
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో బాపు బొమ్మగా మెరిసిన ప్రణీత.. తన రూపమే కాదు, తన మనసు కూడా చాలా అందమైనదని ఓ సేవ కార్యక్రమం ద్వారా తెలియజేస్తోంది. విషయంలోకి వెళ్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆలూరు గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కూడా లేవు. దాంతో అక్కడ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాగా తన తండ్రి పుట్టి పెరిగిన ఆలూరులోని ఆ పాఠశాలను చూసిన ఈ ముద్దు గుమ్మ తన సొంతూరికి సేవ చెయ్యాలనే మంచి ఉద్దేశ్యంతో.. ఎలాంటి సదుపాయాలు లేని అక్కడి పాఠశాలను దతత్త తీసుకుని అక్కడి పాఠశాలను బాగు చేసింది.
ప్రధానంగా ప్రణీత ఆ పాఠశాలకు ఐదు లక్షల రూపాయలతో నిర్మించడంతో పాటుగా విద్యార్థుల తరగతి గదులకు మరమ్మత్తులు చేయించారు. మొత్తానికి ప్రణీత చేసిన ఈ మంచి కార్యక్రమానికి, ఆమెను అందరూ అభినందించి తీరాలి.