మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్ డైరైక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మాస్
డైరైక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ కోటికి పైగా వ్యూస్ సాధించిన విషయం
తెలిసిందే.
కాగా
తాజాగా ఈ చిత్రం నుండి వచ్చిన ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా
వైరల్ గా మారింది. పోస్టర్ చూస్తుంటే యాక్షన్ సీక్వెన్స్ లోని పోస్టర్ లా
అనిపిస్తోంది. మాస్ లుక్ లో ఉన్న రామ్ చరణ్ నెటిజన్లను విపరీతంగా
ఆకట్టుకుంటున్నాడు.
ఇక ఈ చిత్రంలో రామ్
చరణ్ సరసన ‘భరత్ అనే నేను’ ఫెమ్ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా
సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ, ఆర్యన్ రాజేష్ ముఖ్య
పాత్రల్లో నటిస్తున్నారు.
రాక్ స్టార్
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై
దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 11న విడుదలకానుంది.