2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే దేశీయ ఎగుమతులు గణనీయంగా పెరుగాల్సిన అవసరం ఉన్నదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్...
2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరాలంటే దేశీయ ఎగుమతులు గణనీయంగా పెరుగాల్సిన అవసరం ఉన్నదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్య సాధనలో ప్రైవేట్ రంగం పాత్ర కూడా పెద్దదేనని గుర్తుచేశారు.
టైమ్స్ గ్రూప్ భారత ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ గడిచిన నాలుగేండ్లలో దేశీయ వ్యాపార నిర్వహణను సులభతరం చేసే దిశగా ఎన్నో నిర్ణయాలను ప్రభుత్వం తీసుకున్నదని, ప్రపంచ ర్యాంకుల్లో మెరుగైన భారత్ స్థానమే ఇందుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), రెరా, దివాలా చట్టం (ఐబీసీ) వంటి వాటిని అమల్లో పెట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడుతూ వచ్చే ఐదేండ్లలో జీడీపీలో బీమా రంగం వాటా ఒక శాతం చొప్పున పెరుగుతూ పోగలదని అంచనా వేశారు. టీసీఎస్ సీఈవో, ఎండీ రాజేశ్ గోపీనాథన్ మాట్లాడుతూ సవాళ్లతోపాటు అవకాశాలూ అన్ని రంగాల్లో ఉన్నాయన్నారు.