రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎన్నో అడ్డగోలు వ్యవహారాలు జరిగాయని.. మోడీ దేశ ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేస్తూ వచ్చారు. సుప్రీం కోర్టును...
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలులో ఎన్నో అడ్డగోలు వ్యవహారాలు జరిగాయని.. మోడీ దేశ ప్రజలను మోసం చేశారని ఆరోపణలు చేస్తూ వచ్చారు. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారంపై తాము జోక్యం చేసుకోబోమని.. అనుమానాస్పద అంశాలేవీ లేవని అత్యున్నత న్యాయస్థానం చెప్పింది.
సుప్రీం తీర్పుపై బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పుతో రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ చేస్తున్న బూటకపు ప్రచారం బట్టబయలు అయిందని.. తన రాజకీయ అవసరాల కోసమే రాహుల్ ఇలాంటి ప్రచారానికి తెరలేపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లు ఈ ఒప్పందంలో ఎలాంటి పక్షపాతం చూపలేదనీ, ఒప్పంద ప్రక్రియలో ఎలాంటి తప్పు జరగలేదని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిందన్నారు. ఈ వ్యవహారంలో దేశ ప్రజలను, ఆర్మీని తప్పుదారి పట్టించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.