Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

సైనా కశ్యప ల వివాహం అందరూ అనుకున్నదే

భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్… తమ పదేళ్ల ప్రేమ బంధాన్ని … రిజిష్టర్ మ్యారేజ్ ద్వారా మూడుముళ్ల బంధంగా మార్చుకొన్...

భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్… తమ పదేళ్ల ప్రేమ బంధాన్ని … రిజిష్టర్ మ్యారేజ్ ద్వారా మూడుముళ్ల బంధంగా మార్చుకొన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు… హాజరుకావాలంటూ పలువురు రాజకీయ, సీనీప్రముఖులకు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రాలు అందచేశారు.

బ్యాడ్మింటన్లో మామూలే….

భారత క్రీడారంగంలో…ప్రధానంగా బ్యాడ్మింటన్లో… క్రీడాకారులు ఒకరినొకరు తమ జీవితభాగస్వాములుగా చేసుకోడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పుల్లెల గోపీచంద్- పీవీవీ లక్ష్మి, చేతన్ ఆనంద్- గుత్తా జ్వాల, సిక్కీ రెడ్డి-సుమీత్ రెడ్డి…. బ్యాడ్మింటన్ ఆట ద్వారా జంటలుగా మారినవారే.

ఇద్దరూ ఇద్దరే….


ఇప్పుడు తాజాగా… కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ లు పారుపల్లి కశ్యప్- సైనా నెహ్వాల్ సైతం…వరుడు, వధువుగా మారిపోయారు. 32 ఏళ్ల కశ్యప్ తన కెరియర్ లో అత్యుత్తమంగా ప్రపంచ 6వ ర్యాంక్ తో పాటు…. కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధిస్తే… ఇక..సైనా మాత్రం ఏకంగా ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ తో పాటు  2018 కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకం సాధించింది.


ప్రపంచ బ్యాడ్మింటన్ సిల్వర్ మెడల్,  రియో ఒలింపిక్స్ లో కాంస్య పతకం తో పాటు…20 సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన ఘనత ఉంది.

పెద్దల ఆమోదంతోనే….


ఈ ఇద్దరూ..గత దశాబ్దకాలంగా డేటింగ్ చేస్తున్నా…ఎంతో హుందాగా మెలుగుతూ వచ్చారు. కుటుంబ పెద్దల ఆమోదంతోనే… అదీ తమతమ జీవిత లక్ష్యాలు సాధించిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించి.. దానికి అనుగుణంగానే వ్యవహరించారు.వివాహానికి కొద్దివారాల ముందు నుంచే…కశ్యప్, సైనా జోడీ…వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, రాజకీయ, క్రీడారంగ ప్రముఖులకు …శుభలేఖలు పంచుతూ వచ్చారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తో పాటు …రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, మెగాస్టార్ చిరంజీవి, బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ గోపీచంద్ దంపతులకు సైతం… ఈ ఇద్దరు ఆహ్వాన పత్రాలు అందించి వచ్చారు.


భాగ్యనగరంలోని ఓ స్టార్ హోటెల్ లో…సైనా- కశ్యప్ లు ఇచ్చే వివాహవిందుకు…వందమందికి పైగా ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. వివాహం తర్వాత సైతం…బ్యాడ్మింటన్ లీగ్ తో పాటు…అంతర్జాతీయ పోటీలలో సైనా, కశ్యప్ ల జోడీ కొనసాగే అవకాశం ఉంది.