Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

రెండు లక్షల కోట్ల మొండి బాకీలు వసూలు- కేంద్ర ప్రభుత్వం

 బ్యాంకింగ్‌ వ్యవస్థకు పెను సవాల్‌గా మారిన మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత నాలుగేళ్లలో రూ. 2.33ల...


 బ్యాంకింగ్‌ వ్యవస్థకు పెను సవాల్‌గా మారిన మొండిబకాయిలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గత నాలుగేళ్లలో రూ. 2.33లక్షల కోట్ల విలువైన మొండిబకాయిలను ప్రభుత్వ రంగ బ్యాంకులు రికవరీ చేసుకున్నట్లు ఆర్థికశాఖ సహాయ మంత్రి శివ్‌ప్రతాప్‌ శుక్లా లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డేటా ప్రకారం.. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2017-18 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ. 2,33,339కోట్లను రికవరీ చేసుకున్నట్లు శుక్లా తెలిపారు. ఇందులో రూ.32,693కోట్లు రికార్డుల నుంచి తొలగించిన ఖాతాదారుల వద్ద నుంచే రికవరీ చేసుకున్నట్లు చెప్పారు. నిరర్ధక ఆస్తులను రికార్డుల నుంచి తొలగించడం నిరంతర ప్రక్రియ అని శుక్లా తెలిపారు. అయితే అలా తొలగించినప్పటికీ ఆ ఖాతాదారులు అప్పులు చెల్లించాల్సిందేనని.. న్యాయపరంగా రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు కుప్పలుతెప్పలుగా పేరుకుపోతున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు రూ. 2.02లక్షల కోట్ల మేర స్థూల మొండిబకాయిలు ఉన్నాయి. ఇక పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు రూ. 80,993కోట్లు, ఐడీబీఐ బ్యాంక్‌కు రూ. 50,690కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 50,338కోట్లు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 48,575కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 46,454కోట్లు, కెనరా బ్యాంక్‌కు రూ. 41,907కోట్లు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 37,411కోట్లు, ఇండియన్ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు రూ. 35,607కోట్లు, యూకో బ్యాంక్‌కు రూ. 28,822కోట్ల మేర స్థూల నిరర్ధక ఆస్తులు ఉన్నాయి.