Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

అగ‌ష్టు 15న “సాహో” విడుద‌ల‌

‘బాహుబలి’ 1,2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతు...

Saaho, Prabhas
‘బాహుబలి’ 1,2 తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘సాహో ఇండిపెండెన్స్ డే అగ‌ష్టు 15 న నేష‌న‌ల్ హ‌లిడే సంద‌ర్బంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మైంది.
మూడు భాష‌ల్లో రిలీజ్ చేయ్య‌ట‌మే కాదు మూడు భాష‌ల్లో షూటింగ్ జ‌రుపుకుంటున్న ట్రైలింగ్విల్ గా ఇండియాలో ఇదే మెద‌టి చిత్రం కావ‌టం విశేషం. మ‌ల్టి లాంగ్వేజెస్ ఒకేసారి షూట్ చేస్తున్న ఇండియ‌న్ ఫిల్మ్ సాహో విడుద‌ల కి కౌంట్ డౌన్ స్టార్ట‌యింది.
రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన షాడో ఆఫ్ సాహో కి ఇప్ప‌టికే ఇండియా మెత్తం క్రేజ్ వ‌చ్చింది. ప్ర‌పంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకున్నారు. ఇంత‌టి భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి ర‌న్‌ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. సాహో ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు. సాహోలో ప్రభాస్ స‌ర‌స‌న‌ బాలీవుడ్ బబ్లీ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌, హైటెక్ యాక్ష‌న్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో చిత్రీక‌రించారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ వంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మా బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం అగ‌ష్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. సాహో ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన రావడం చాలా హ్యాపీ గా ఉంది. ప్రభాస్ స్టైలిష్ పెర్ఫార్మన్స్, సుజిత్ వరల్డ్ క్లాస్ విజన్, శ్రద్ధా కపూర్ అందచందాలు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ టాప్ క్లాస్ మ్యూజిక్, మధి గ్రాండియర్ విజువల్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయి. అని అన్నారు.