తెలుగు నాచ్యురల్ స్టార్, తమిళ్ యాక్షన్ స్టార్ ఓకే సినిమాలో కలిసి నటిస్తే.. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా ఆ సినిమాకి భారీ క్రేజ్ ఉంటు...
తెలుగు నాచ్యురల్ స్టార్, తమిళ్ యాక్షన్ స్టార్ ఓకే సినిమాలో కలిసి నటిస్తే.. ఇటు తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా ఆ సినిమాకి భారీ క్రేజ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకి విషయంలోకి వెళ్తే.. నాని, విశాల్ ఒకే స్క్రీన్ పై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. యాత్ర దర్శకుడు మహి వి రాఘవ ఈ భారీ మల్టీస్టారర్ కి ప్లాన్ చేస్తున్నారు. హీరోలు ఇద్దరూ కూడా ఈ మల్టీస్టారర్ చెయ్యడానికి అంగీకరించారని.. కథలో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చెప్పకుండా, కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తానికి నాని మల్టీస్టారర్ లకు బాగానే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. నాగ్ తో దేవదాస్ లో నటించి.. కాంబినేషన్ పరంగా పాజిటివ్ టాక్ ని అందుకున్నాడు. ఇప్పుడు మరో మల్టీస్టారర్ లో కూడా నటించి సూపర్ హిట్ అందుకుంటాడేమో చూడాలి. పైగా తమిళ్ లో కూడా నాని మంచి స్టార్ డమ్ ని సంపాదించడానికి ఈ మల్టీస్టారర్ ఉపయోగపడనుంది. ఇక విశాల్ కు ఇప్పటికే తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఈ మల్టీస్టారర్ ద్వారా అది మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం యాత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మహి వి రాఘవ త్వరలోనే ఈ మల్టీస్టారర్ పై అధికారికంగా వర్క్ మొదలు పెట్టనున్నారట.
కాగా ఈ మల్టీస్టారర్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి నిర్మించనున్నారు. ఏప్రిల్ నుండి ఈ మల్టీస్టారర్ రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.