Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ప్రతి పౌరుడికి 320 రూ పొదుపు జి ఎస్ టి వలన

రెండేండ్లక్రితం అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధానంతో పన్ను చెల్లింపులు పెరుగడమే కాదు భారతీయుల పొదుపు కూడా పెరిగింది. రోజు...



రెండేండ్లక్రితం అమలులోకి వచ్చిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విధానంతో పన్ను చెల్లింపులు పెరుగడమే కాదు భారతీయుల పొదుపు కూడా పెరిగింది. రోజువారి వినియోగించే ఉత్పత్తులైన ధాన్యాలు, వంటనూనె, కాస్మోటిక్స్ కోసం సామాన్యులు పెట్టే ఖర్చు మరింత తగ్గింది. దీంతో నెలకు వారి సరాసరి పొదుపు రూ.320 వరకు పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. 


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 17 రకాల పన్నులకు ప్రత్యామ్నాయంగా రూ పొందించిన జీఎస్టీ జూలై 1, 2017 నుంచి అమలులోకి వచ్చింది. జీఎస్టీ అమలుకంటే ముందు.. ఆ తర్వాత కుటుంబాల ఖర్చుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన నాటి నుంచి 83 వస్తువులపై విధించే పన్నులు తగ్గుముఖం పట్టాయని, వీటిలో రోజువారిగా వినియోగించే హెయిర్ ఆయిల్, టూథ్‌పేస్ట్, సబ్బులు, వాషింగ్ పౌడర్, పాదరక్షలు ఉన్నాయి.

ధాన్యాలు, వంటనూనె, చక్కె ర, చాక్లెట్లు, ఉప్పుగా ఉండే పదార్థాలు, స్వీట్లు, కాస్మోటిక్స్, అలంకార వస్తువులు, వాషింగ్ పౌడర్, టైల్స్, ఫర్నిచర్, కొబ్బ రి ఉత్పత్తులతోపాటు ఇతర గృహోపకరణాల కోసం నికరంగా రూ.8,400 చెల్లించేవారు. వీటిపై పన్నుల రూపంలో రూ.830 వసూలు చేసేవారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఇది రూ.510కి తగ్గినది. అంటే గృహస్తులకు అదనంగా రూ.320 మిగిలినట్టేనని పేర్కొంది.

 ఈ ఆహార పదార్థాలపై జీఎస్టీ పన్ను తగ్గడం వల్లనే వినియోగదారుల నెలవారి పొదు పు పెరుగడానికి ప్రధాన కారణం. పాత పన్నుల విధానంలో వస్తువులపై ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్‌ను విధిస్తుండేవి. వీటితోపా టు పాల పౌడర్, పెరుగు, గోధుమలు, బియ్యం, హార్లిక్స్/బోర్న్‌వీటా, పాస్తా, ఇడ్లి, దోష, బట్టర్, మినరల్ వాటర్‌లపై విధించే పన్నులు కూడా భారీగా తగ్గాయి. వీటిలో గోధుమలు, బియ్యంలను జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. 

గతంలో వీటిపై 2.50-2.75 శాతం పన్ను విధించేవారు. అలాగే పాలు, చక్కెర, వంటనూనెలపై విధించే పన్నును 6 శాతం నుం చి 5 శాతానికి తగ్గించారు. గతంలో 12/7 శాతం పన్నును విధిస్తున్న స్వీట్లపై 5 శాతానికి కుదించారు.