Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఎన్టీఆర్ జీవితకథ లో ప్రకాష్

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ మొదట హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయిన విషయం తెలిసిందే. ఇక దాంతో ఆయన నటనక...

prakash kovelamudi in NTR Biopic
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ మొదట హీరోగా సినీ ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయిన విషయం తెలిసిందే. ఇక దాంతో ఆయన నటనకు చాలా సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే డైరెక్టర్ గా కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయ్యారు అనుకోండి అది వేరే విషయం. ఇక అసలు విషయంలోకి వెళ్తే క్రిష్ దర్శకత్వంలో బాలయ్య నిర్మాణంలో మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కతున్న బయోపిక్ పార్ట్స్ లో తన తండ్రి లెంజెండరీ దర్శకుడు రాఘవేంద్రరావు పాత్రలో ప్రకాష్ నటించబోతున్నారు. ముఖ్యంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నటరత్న ఎన్టీఆర్ ని ఎలా డైరెక్ట్ చేశాడు, ఆ రోజుల్లో షూటింగ్ ని ఎంత నిబద్దతతో చేసేవారు. ఎలాంటి వాతావరణంలో చేసేవారు లాంటి అంశాలను ఈ సినిమాలో చూపించనున్నారు. అయితే బాలయ్య మరియు ప్రకాష్ పై చిత్రబృందం ఇప్పటికే కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించింది.
ఇక పర్సనల్ గా కూడా ఎన్టీఆర్ తో రాఘవేంద్రరావుకి చక్కటి అనుబంధం ఉంది. వీరిద్దరి కలయికలో ‘వేటగాడు, డ్రైవర్ రాముడు, అడవి రాముడు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. బయోపిక్ లో ఆ చిత్రాల షూటింగ్ కి సంబంధించిన సంఘటనలనే ప్రధానంగా చూపించనున్నారు. ఇక కీరవాణి సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ను జనవరి 9న విడుదల చేయనున్నారు. అలాగే జనవరి 24న రెండో పార్ట్ ‘మహానాయకుడు’ను విడుదల చేయనున్నామని చిత్రబృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించినా, మహానాయకుడు విడుదల మాత్రం పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువుగా కనిపిస్తున్నాయి.