Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

నిజం గా కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో గెలిచిందా

బీజేపీని వ్యతిరేకించడంలో భాగంగా కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న శక్తులు తిమ్మిని బొమ్మి చేసి చూపడం, వాస్తవాలకు మసి పూసి మారెడు క...


బీజేపీని వ్యతిరేకించడంలో భాగంగా కాంగ్రెస్ ను నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్న శక్తులు తిమ్మిని బొమ్మి చేసి చూపడం, వాస్తవాలకు మసి పూసి మారెడు కాయగా చూపడంలో సమర్ధులు.. కిందపడ్డా మాదే పైచేయి అన్నట్లు వారు చేస్తున్న ప్రచారం ఎలా ఉంటుందో చూడండి..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను గమనిస్తే బీజేపీ ఘోర పరాజయం పొందింది ఛత్తీస్ గఢ్ లో మాత్రమే.. కానీ కాంగ్రెస్ మిజోరంలో ప్రభుత్వాన్ని కోల్పోయింది. స్వయాన వారి ముఖ్యమంత్రి లాల్ తన్హావ్లా పోటీ చేసిన రెండు సీట్లలో ఓడిపోయాడు. ఇక తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చూశాం కదా?.. కానీ ఈ విషయాన్ని వారు తక్కువ చేసి చూపుతున్నారు..
ఇక రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతోంది అంటూ ఊదరగొట్టారు. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీ కనీస మెజారిటీ తెచ్చుకోలేదు. మధ్యప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి కదా.. బీజేపీ సీట్ల పరంగా సమఉజ్జీగానే ఉంది. పైగా ఓట్ల శాతం కాంగ్రెస్ కన్నా ఎక్కువే.. మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఎక్కడ సాధించినట్లు?.. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో 15 ఏళ్ల నుంచి కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వాలపై ప్రజల్లో కొంత వ్యతిరేకత సహజం. కాంగ్రెస్ ఇచ్చిన గాలి మేడల వాగ్దానాలను నమ్మి ఓటేశారు. ఆ హామీలు ఆచరణ సాధ్యమే అయితే బీజేపీ అమలు చేసేది కదా.. దీన్ని వాళ్లు అంగీకరించరు..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత ఎదురీదినా కనీస మెజారిటీ తెచ్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినా కాంగ్రెస్ భజనపరులు ఓడిపోయిందంటారు.. కాంగ్రెసే గెలిచింది అన్నట్లు ప్రచారం చేశారు.. మరి ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ కనీస మెజారిటీ కూడా తెచ్చుకోలేదు కదా.. అక్కడ  బీజేపీ గెలిచిందని అనవచ్చా?.. ఈ విషయంలో వారు మౌనవ్రతం పాటిస్తారు..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినా ఓడిపోయినట్లు.. అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మంతనాలు జరిపితే అనైతికం.. కానీ ఆ రాష్ట్ర ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్ అతి తక్కువ సీట్లు జేడీఎస్ ను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నైతికం..  ఎందుకండీ ఈ ద్వంద్వ ప్రమాణాలు?..
మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది అనేది వాస్తవం.. అదే సమయంలొ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంలో ఓడిపోయి, మరో రాష్ట్రంలో చతికిల పడటం వాస్తవం కాదా?.. రెండు రాష్ట్రాల్లో కనీస మెజారిటీ కూడా లేనప్పుడు కాంగ్రెస్ ఏదో పొడిచేసింది అన్నట్లు జబ్బలు చరచుకోవడం, భజనలు చేయడం డొల్లతనం కాదా?
వాస్తవాలను అంగీకరిద్దాం.. ఆత్మ విమర్శ చేసుకుందాం.. అదే సత్యం..