‘‘రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం. వైసీపీ అధినేత అవినీతిలో కూరుకుపోయారు. ఆయన ట్రాక్ బాలేదు. ఈ తరుణంలో బీజేపీనే రాష్ట్రంలో ప్రత్య...
‘‘రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఓటమి ఖాయం. వైసీపీ అధినేత అవినీతిలో కూరుకుపోయారు. ఆయన ట్రాక్ బాలేదు. ఈ తరుణంలో బీజేపీనే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ’’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. బీజేపీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేదని భరోసా వ్యక్తం చేశారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తోందని, పొత్తుకోసం వెంపర్లాడదని తేల్చి చెప్పేసారు. అయితే టీడీపీ తప్ప ఏ పార్టీ అయినా తమ దగ్గరకు వస్తే పొత్తు పెట్టుకునేందుకు పరిశీలిస్తామని తెలిపారు.
తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అంటూ సీఎం చంద్రబాబు.. చందా బాబుగా మా రిపోయారని దుయ్యబట్టారు. స్వార్థం కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అడిగారని, సొమ్ముల కోసమే భోగాపురం ఎయిర్‌పోర్ట్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించేందుకు సీఎం అంగీకరించలేదని మండిపడ్డారు. జనవరి 6న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో పర్యటిస్తాని దేవధర్ చెప్పారు.
బాహుబలి సినిమాలో కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టుగా చంద్రబాబు ఎన్‌టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఊసరవెల్లి లాగా రంగులు మార్చడం చంద్రబాబుకే చెల్లిందని ధ్వజమెత్తారు.
రాజధాని అమరావతిలో, విశాఖపట్నం పోర్టు రైతుల నుంచి పొలాలు లాక్కుని వారిని మోసం చేశారని ఆరోపించారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిన టీడీపీ పెద్ద డ్రామా పార్టీ అని, రాబోయే రోజుల్లో ప్రజలు భూస్థాపితం చేస్తారని స్పష్టం చేశారు.