Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

ఆంధ్ర, తెలంగాణ‌ల‌ లో ఇలాంటి చూశామా?

రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌ల‌మ్ నాథ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ లో భూపేష్ భ‌గేల్ ముఖ్య‌మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు....


రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో క‌ల‌మ్ నాథ్‌, ఛ‌త్తీస్ గ‌ఢ్ లో భూపేష్ భ‌గేల్ ముఖ్య‌మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఒకే రోజు జ‌రిగిన ఈ మూడు వేడుక‌ల వేదిక‌ల‌పై అప్ప‌టి వ‌ర‌కూ ఆయా రాష్ట్రాల‌ను పాలించిన బీజేపీ మాజీ ముఖ్య‌మంత్రులు వ‌సుంధ‌ర రాజే, శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌, ర‌మ‌ణ్ సింగ్ క‌నిపించారు.. కొత్త ముఖ్య‌మంత్రుల‌ను పాత ముఖ్య‌మంత్రులు హృద‌య‌ పూర్వ‌కంగా అభినందించారు..
ఈ దృశ్యం చూస్తే చాలా ఆనందం క‌లిగిలింది. ప్ర‌జ‌ల తీర్పును గౌర‌విస్తూ విజేత‌ల‌ను అభినందించ‌డం మ‌న ప్ర‌జాస్వామ్యంలో ఉన్న గొప్ప సుగుణం.. దీని ద్వారా ప‌రాజితుల‌కు పోయేదేం లేదు.. విజేత‌ల‌కు వ‌చ్చేదేం లేదు.. కానీ వారి హుందా, గౌర‌వం మ‌రింత ఇ నుమ‌డిస్తాయి..
మ‌న తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి అపురూప దృశ్యాన్ని మ‌న తరంలో చూశామా?.. ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రాజ‌శేఖ‌ర రెడ్డి దూరం.. రాజ‌శేఖ‌ర రెడ్డి ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో చంద్రబాబు దూరం.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో జ‌గ‌న్ క‌నిపించ‌లేదు.. కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో కాంగ్రెస్ నేత‌ల మిస్సింగ్‌.. గ‌తంలో ఇలాంటి రాజ‌కీయ దుర్గుణం త‌మిళ డ్ర‌విడ పార్టీల్లోనే ఉండేది.. ఇప్పుడ‌ది ఆంధ్ర, తెలంగాణ‌ల‌కు కూడా సోకింది..