Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

దొరకు ముహుర్తము కరారైంది

తెలంగాణ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెరాస అధినేత కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్య...


తెలంగాణ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన తెరాస అధినేత కేసీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం 1.25 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. కేసీఆర్‌తో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన తర్వాతే తన ప్రమాణస్వీకారం ఉంటుందని కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే, ఈ రోజు తెలంగాణలో రెండో శాసనసభ ఏర్పాటుపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం చట్టబద్ధ నోటిఫికేషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ఈ రోజు తేదీతో గెజిట్ జారీ చేశారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం 73వ విభాగం ప్రకారం శాసనసభకు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన 119 మంది పేర్లను అధికారికంగా ప్రకటించారు. సభ్యులు ఎన్నికైన పార్టీల వివరాలను కూడా ఈ గెజిట్‌లో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి ఆదేశాలకు అనుగుణంగా రజత్ కుమార్ తెలంగాణ రాజపత్రాన్ని జారీ చేశారు.


మరోవైపు, సీఎం కేసీఆర్‌తో పాటు 17 మంది మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు సీఎంగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్‌ కోరారు.