118 టీజర్ లో ఎన్టీఆర్ లా కనిపిస్తున్న కళ్యాణ్ రామ్

మాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఫార్ములా కథలకు కాలం చెల్లిపోవడంతో కొత్తగా ఉండే సినిమాలు ట్రై చేస్తున్నాడు.నా నువ్వే అనే సాఫ్ట్ లవ్ స్టోరీ తో ప్రేక్షకులముందుకు వచ్చి మెప్పించలేకపోయిన కళ్యాణ్ రామ్ మళ్ళీ 118 అనే థ్రిల్లర్ సినిమా చేసాడు.అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే,నివేతా థామస్ హీరోయిన్స్ గా తెరకెక్కిన 118 ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.
Nandamuri Kalyan ram, nivetha thomas, shalini pandey, 118 movie First Look,
ఇక ఇప్పడు ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది.118 టీజర్ లో సినిమా లైన్ ని రివీల్ చేసారు.హ్యాపీ గా జీవితం గడిపేస్తున్న క్యూట్ కపుల్ జీవితంలో జరిగిన ఒక సంఘటన వాళ్ళ జీవితాల్ని ఎలా మలుపుతిప్పింది అనేది మెయిన్ పాయింట్.ఆ తరువాత హీరో ఆ ఇన్సిడెంట్ వెనుక ఉన్న వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేసాడు?,వాళ్ళని ఏం చేసాడు అనేది సినిమా ప్లాట్.ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ లుక్ మాత్రం సూపర్ స్టైలిష్ గా ఉంది.చాలా చోట్ల ఎన్టీఆర్ లా కనిపిస్తున్నాడు కళ్యాణ్ రామ్.షాలిని పాండే అండ్ కళ్యాణ్ రామ్ ల పెయిర్ కూడా బావుంది.మరి హీరోయిన్ అయిన నివేతా థామస్ ని ఈ టీజర్ లో చూపించకపోవడం సినిమా పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
అనేక పెద్ద సినిమాలకు సినిమాటోగ్రాఫర్ కి కెమెరామన్ గా పనిచేసిన గుహన్ ఈ సినిమాతో డైరెక్టయిర్ గా న్యూ టర్న్ తీసుకుంటున్నాడు.టీజర్ లో రేసీ కంటెంట్ అండ్ గ్రాండియర్ చూపించి ఫస్ట్ స్టెప్ లో సక్సెస్ అయ్యాడు.ఈ సినిమా విజువల్స్ సినిమా రేంజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి.శేఖర్ చంద్ర బ్యాక్ గౌండ్ స్కోర్ సినిమాకి మరో హైలైట్.ఓవర్ ఆల్ గా చూస్తే రేసీగా,ఇంటెన్స్ గా ఉన్న 118 టీజర్ ఆకట్టుకుంది.అయితే 118 అనేది డేట్ కి సంబంధించిందా లేక టైం కి సంబంధించిందా లేక సినిమాలో ఇంకేదయినా కీ ఎలిమెంట్ కి రెక్ట్ అయ్యి ఉందా అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలి.
Post A Comment
  • Blogger Comment using Blogger
  • Facebook Comment using Facebook
  • Disqus Comment using Disqus

No comments :


రాజకీయాలు

[news][bleft]

చరిత్ర

[history][twocolumns]

సైన్యం

[army][threecolumns]

చిన్న కథలు

[army][grids]

క్రీడలు

[sports][list]

వినోదం

[entertainment][bsummary]