Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

Breaking

latest

పీఓకే విముక్తి తర్వాత అక్కడా నియోజకవర్గాల పునర్విభజన: డీలిమిటేషన్ బిల్లు - Delimitation Bill sets rules for J and K seats in PoK after occupation ends

పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోజేకే) ప్రాంతం పాకిస్థాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందిన తర్వాత అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించేందుక...

పీఓకే విముక్తి తర్వాత అక్కడా నియోజకవర్గాల పునర్విభజన: డీలిమిటేషన్ బిల్లు

పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోజేకే) ప్రాంతం పాకిస్థాన్ ఆక్రమణ నుంచి విముక్తి పొందిన తర్వాత అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం నూతన బిల్లును తీసుకువచ్చింది. లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న డీలిమిటేషన్ (సెకండ్) బిల్లు, 2026 ద్వారా ఈ కీలక నిబంధనను పొందుపరిచారు. పాకిస్థాన్ ఆక్రమణలో ఉన్న ఆ ప్రాంతం ఆ నియంత్రణ నుంచి ఎప్పుడైతే బయటపడుతుందో, అప్పుడు అక్కడి నియోజకవర్గాల సరిహద్దులను మార్చే అధికారాన్ని ఈ బిల్లు కల్పిస్తోంది.

ప్రతిపాదిత బిల్లులోని సెక్షన్ 3(4) ప్రకారం.. ఆ ప్రాంతం ఆక్రమణ నుంచి విముక్తమైనప్పుడు భారత ఎన్నికల సంఘమే డీలిమిటేషన్ కమిషన్‌గా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఈ బిల్లులో 'పీవోకే' అనే పదాన్ని వాడకుండా 'పాకిస్థాన్ ఆక్రమణ కిందకు వచ్చే జమ్మూకశ్మీర్ ప్రాంతం' అనే పదబంధాన్ని ఉపయోగించారు. దేశంలోని ఇతర ప్రాంతాల కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షుడిగా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఎలక్షన్ కమిషనర్ మరియు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ సభ్యులుగా మరో ప్రత్యేక కమిషన్‌ను ఈ బిల్లు ఏర్పాటు చేస్తోంది.

అయితే ఆక్రమిత ప్రాంతానికి సంబంధించి ఈ నిబంధన కేవలం జమ్మూకశ్మీర్ శాసనసభ నియోజకవర్గాలకే పరిమితమని, లోక్‌సభ స్థానాల గురించి ఇందులో ఎక్కడా పేర్కొనలేదని వెల్లడించారు. అంతేకాకుండా, ఆ ప్రాంతం కోసం ఎప్పటి నుంచో కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల గురించి లేదా సీట్ల సంఖ్యలో ప్రతిపాదిత 50 శాతం పెంపుదల ఆ ప్రాంతానికి వర్తిస్తుందా లేదా అనే అంశంపై ఈ బిల్లులో స్పష్టత ఇవ్వలేదు. ఈ నిబంధన షరతులతో కూడుకున్నది కాబట్టి, పాకిస్థాన్ ఆక్రమణ అంతం అయితేనే ఇది అమలులోకి వస్తుందని తెలిపింది.

ఈ డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళలకు రిజర్వేషన్ల అమలు దిశగా యూనియన్ టెరిటరీస్ లాస్ (అమెండ్‌మెంట్) సెకండ్ బిల్లు, 2026ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి అనే మూడు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలను 132వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా మార్చేందుకు ఈ సవరణ బిల్లు దోహదపడుతుంది. గతంలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు తగిన సంఖ్యాబలం లేక వీగిపోవడంతో, ఇప్పుడు కొత్త సవరణ బిల్లుతో పాటు ఈ రెండు బిల్లులను సోమవారం లోక్‌సభ ముందుకు తీసుకురానున్నారు.