కరుణాత్మక భావనను ప్రపంచవ్యాప్తం చేయడం ప్రస్తుత సమయానికి అత్యంత కీలకమని ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. నవంబర్ 27న న్...

కరుణాత్మక భావనను ప్రపంచవ్యాప్తం చేయడం ప్రస్తుత సమయానికి అత్యంత కీలకమని ఆర్‌ఎస్‌ఎస్ సర్సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. నవంబర్ 27న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ భీమ్ ఆడిటోరియంలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి రచించిన కరుణానాయక్ రామ్ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ప్రభాత్ ప్రకాశన్ ప్రచురించిన ఈ పుస్తకం భగవాన్ రాముడి వ్యక్తిత్వం, జీవిత తత్వం, ఆదర్శాలను కరుణ, మానవ సంవెదన, సామాజిక న్యాయం, నైతిక బాధ్యత నేపథ్యంలో వివరిస్తుంది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ (ఐజీఎన్‌సీఏ) మీడియా సెంటర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ వేడుకలో భూటాన్ రాకుమారి ప్రిన్సెస్ సోనమ్ డెచన్ వాంగ్చుక్ గౌరవ అతిథిగా హాజరుకాగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుస్తక రచయిత కైలాష్ సత్యార్థి, ఐజీఎన్‌సీఏ మెంబర్ సెక్రటరీ డాక్టర్ సచ్చిదానంద్ జోషి, ప్రచురణకర్త ప్రభాత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానోపన్యాసం చేసిన డాక్టర్ మోహన్ భగవత్ భగవాన్ రాముడు చాటిన కరుణను, ప్రస్తుత కాలంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. ఇతరుల కష్టాలను తొలగించడానికి మనల్ని ప్రేరేపించే సహజమైన భావనే కరుణ అని ఆయన పేర్కొన్నారు.