Page Nav

HIDE

Grid

GRID_STYLE

Pages

latest

హిందూ మహాసముద్ర భద్రతా సహకారంపై కొత్త ప్రాధాన్యతలను ప్రకటించిన కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ - Colombo Security Conclave Announces New Priorities for Indian Ocean Security Cooperation

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతా సహకారాన్ని మరింత బలపరిచేందుకు కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ 2026-2027 సంవత్సరాలకు కొత్త ప్రాధాన్యతలను ఖరారు ...

హిందూ మహాసముద్ర భద్రతా సహకారంపై కొత్త ప్రాధాన్యతలను ప్రకటించిన కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్

హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రతా సహకారాన్ని మరింత బలపరిచేందుకు కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ 2026-2027 సంవత్సరాలకు కొత్త ప్రాధాన్యతలను ఖరారు చేసింది. మాల్దీవుల రాజధాని మాలేలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో సభ్య దేశాలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.

సముద్ర మార్గాల రక్షణ, ఉగ్రవాదం నిరోధం, అక్రమ రవాణా నియంత్రణ, సైబర్‌ భద్రత వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రాంతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా సభ్య దేశాలు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించాయి.

ఈ సమావేశంలో భారత్ తరఫున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొని ప్రసంగించారు. అలాగే మాల్దీవుల జాతీయ భద్రతా సలహాదారు లెఫ్టినెంట్ కర్నల్ ఇబ్రహీం లతీఫ్, శ్రీలంక రక్షణ కార్యదర్శి సంపత్ తూయకొంత, బంగ్లాదేశ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ ఫైజుర్ రెహమాన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మారిషస్ ఈ సమావేశానికి వర్చువల్ విధానంలో హాజరుకాగా, ఆస్ట్రేలియా, మలేషియా దేశాలు అతిథి దేశాలుగా పాల్గొన్నాయి. కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ మొదటి సెక్రటరీ జనరల్ వైస్ అడ్మిరల్ ఎస్.ఎన్. ఘోర్మాడే గత సమావేశ నిర్ణయాల అమలుపై నివేదికను సమర్పించారు.